Covid Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే రెండు రోజుల విమాన ప్రయాణాలు చేయకూడదు.. పౌర విమానయాన శాఖ కీలక ఆదేశాలు
Covid Vaccine: దేశంలో కరోనాను అరికట్టేందుకు అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్ ప్రస్తుతం దేశంలో విజయవంతంగా ...
Covid Vaccine: దేశంలో కరోనాను అరికట్టేందుకు అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్ ప్రస్తుతం దేశంలో విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మంది ఈ కరోనా టీకాను తీసుకున్నారు. రెండో విడత కూడా తీసుకున్నారు. అయితే టీకాకు సంబంధించి ఓ విషయాన్ని వెల్లడించింది పౌర విమానయాన శాఖ. కోవిడ్ టీకా తీసుకున్న పైలట్లు 48 గంటల పాటు క్యాబిన్ క్రూ విమాన ప్రయాణాలు చేయకూడదని పౌర విమానయాన శాఖ (డీజీసీఏ) తాజాగా దేశాలు జారీ చేసింది. టీకా తీసుకున్న వారు 48 గంటల పాటు ఆరోగ్యపరంగా విధులు నిర్వహించే స్థితిలో ఉండరని తెలిపింది.
ఈ మేరకు డీజీసీఏ మంగళవారం ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. గడువు తర్వాత కూడా సిబ్బందికి వైద్య పరీక్షలు ఉంటాయని, ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా సిబ్బంది లేని సిబ్బందికి మాత్రమే విధుల్లోకి చేరే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. 48 గంటల తర్వాత పైలట్‌లో ఆరోగ్య సమస్య తలెత్తితే అటువంటి వారు వైద్యుడిని రిఫర్ చేయాల్సి ఉంటుందని సూచిచింది. కాగా, ఇప్పటికే దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. భారత్‌లో అందుబాటులోకి వచ్చిన కోవిడ్ వ్యాక్సిన్లు మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయని కేంద్రం తెలిపింది. అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు తప్ప ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదని పేర్కొంది. ప్రతి ఒక్కరు కూడా టీకా తీసుకోవాలని, ఎలాంటి అనుమానాలు, అపోహాలు పెట్టుకోవద్దని సూచిస్తోంది.
OTP: బ్యాంకు లావాదేవీలు, ఈ-కామర్స్, ఆధార్ వెరిఫికేషన్ తదితర ఓటీపీలు రావడం లేదా..? కారణం ఇదేనట..!