AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Virus: మహారాష్ట్రంలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి.. కీలక ప్రకటన చేసిన ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే..

Corona Virus: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి రోజు రోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. ఒక్క రోజులో 14,000 మంది కరోనా బారిన పడటంతో..

Corona Virus: మహారాష్ట్రంలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి.. కీలక ప్రకటన చేసిన ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే..
Uddhav Thackeray
Shiva Prajapati
|

Updated on: Mar 12, 2021 | 3:59 PM

Share

Corona Virus: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి రోజు రోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. ఒక్క రోజులో 14,000 మంది కరోనా బారిన పడటంతో రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ విధించే యోచనలు కనిపిస్తున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా లాక్‌డౌన్‌ విధింపుపై ఆయన స్పష్టమైన సంకేతాలిచ్చారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండటానికి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కఠినమైన లాక్‌డౌన్ విధించబడుతుందని స్పష్టం చేశారు. అయితే, లాక్‌డౌన్ విధించే ముందు ప్రభుత్వ అధికారులతో ప్రత్యేక సమావేశం జరుగుతుందన్నారు. ఇక రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో టీకాలు వేస్తున్నామని, ఆరోగ్య కార్యకర్తలు కరోనా నియంత్రణ, కాంట్రాక్ట్ ట్రేసింగ్, చికిత్సలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని సీఎం తెలిపారు.

అనేక ప్రాంతాల్లో కరోనా నిబంధనల ఉల్లంఘనలు.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో కఠినమైన నిబంధనలను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. అయితే కొందరు ప్రజలు మాత్రం పూర్తి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. మాస్క్‌ ధరించకుండా విచ్చలవిడిగా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నారు. వీరి నిర్లక్ష్యం కారణంగానే నేడు దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. మహారాష్ట్రలో మరింత స్పీడ్‌గా కరోనా వ్యాప్తి చెందుతోంది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రజలకు కీలక సూచనలు చేశారు. లాక్‌డౌన్ వద్దు అనుకుంటే ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్నారు. అలాగే, శారీరక దూరం పాటించడం, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం వంటి వాటిని పాటించాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదం తప్పదని హెచ్చరించారు.

మళ్లీ పెరిగిన కరోనా మృతుల సంఖ్య.. ఇవాళ ఒక్క రోజు రాష్ట్రంలో కొత్తగా 14,317 మంది కరోనా బారిన పడ్డారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 22,66,374 మందికి చేరింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కరోనా కారణంగా 57 మంది బాధితులు చనిపోయారు. రాష్ట్రంలో మరణాల రేటు 2.23 శాతంగా ఉండగా, ఇవాళ ఒక్క రోజు 7,193 మంది రోగులు కరోనా నుంచి కోలుకుని ఇంటికి వెళ్లారు. మొత్తంగా చూసుకున్నట్లయితే 21,06,400 మంది కరోనాను జయించారు. కరోనా రికవరీ రేటు 92.94 శాతంగా ఉంది.

Also read:

Prabhas Adipurush: రాముడికి సీత దొరికింది..! ప్రభాస్‌ సరసన నటించేది ఆ భామే.. వైరల్‌గా మారిన ఫొటోలు..

COVID-19 vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కొన్ని గంటలకే.. బెంగాల్‌లో ఇద్దరు వృద్ధుల మృతి..