హెచ్చరిక.. పెళ్లి కాని మగవారికి కరోనా మరణం ముప్పు ఎక్కువ..!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. కరోనాకు ఎలా అడ్డుకట్ట వేయొచ్చు..? కరోనా రెండోసారి సోకితే ఇబ్బందులు ఏంటి..?

హెచ్చరిక.. పెళ్లి కాని మగవారికి కరోనా మరణం ముప్పు ఎక్కువ..!
Follow us

| Edited By:

Updated on: Oct 11, 2020 | 12:27 PM

Corona deaths married: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. కరోనాకు ఎలా అడ్డుకట్ట వేయొచ్చు..? కరోనా రెండోసారి సోకితే ఇబ్బందులు ఏంటి..? దీర్ఘకాలిక ఆరోగ్యంపై కరోనా ఎలాంటి ప్రభావం చూపుతుంది..? ఏఏ వయసు వారిలో కరోనా రిస్క్ ఎక్కువ..? వంటి అంశాలపై శాస్త్రవేత్తల పరిశోధలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు మరో షాకింగ్ న్యూస్‌ని వెల్లడించారు. పెళ్లి కాని మగవారికి కరోనా మరణం ముప్పు ఎక్కువగా ఉంటుందని వారు తెలిపారు.

పురుషుల్లో.. పెళ్లి అవ్వని వారు, తక్కువ డబ్బులను సంపాదించే వారు, తక్కువ చదువుకున్న వారు, మధ్యతరగతి, దానికి దిగువ కుటుంబాల్లో పుట్టినవారు పలు ఇబ్బందులతో ఒత్తిడికి గురవుతుంటారని, ఈ క్రమంలో ఈ వైరస్ మరణం ముప్పు ఎక్కువగా ఉందని స్వీడెన్‌లోని స్టాక్‌హోమ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. స్వీడెన్‌లో కరోనాతో సంభవించిన మరణాల్లో 20 సంవత్సరాలు ఆపై ఉన్న యువకులు ఉన్నారని వారు తెలిపారు. ఈ విషయాలను జర్నల్ న్యాచుర్‌ కమ్యూనికేషన్‌లో పొందపరిచారు.

పెళ్లి చేసుకున్న వారితో పోలిస్తే పెళ్లి అవ్వని మహిళలు, పురుషుల్లో(ఎప్పటికీ పెళ్లి చేసుకోని వారు, వితంతువులు, విడాకులు తీసుకున్న వారు కూడా) మరణం ముప్పు ఎక్కువగా ఉంటుందని ఆ పరిశోధనలో తేలింది. ఇక అందులోనూ మహిళల కంటే పురుషులకే ఎక్కువ ఇబ్బందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విషయం గతంలోనూ పలు పరిశోధనల్లో తేలిందని వారు చెబుతున్నారు.

ఈ పరిశోధనలో సింగిల్‌గా ఉండే వారి వలన పర్యావరణానికి తక్కువ రక్షణ ఉంటుందన్న విషయాన్ని పరిగణలోకి తీసుకున్నాము. పెళ్లి కాని వారితో పోలిస్తే పెళ్లైన వారితోనే ఆరోగ్యవంతమైన జీవితం ఉంటుంది. కరోనా సోకినా మరణం ముప్పు కూడా పెళ్లైన వారిలో తక్కువగా ఉంటుది అని ఈ పరిశోధనలో పాల్గొన్న డ్రెఫాల్‌ వెల్లడించారు.

Read More:

Bigg Boss 4: మోనాల్‌తో అఖిల్‌ లవ్‌.. ఇంటికి రాగానే పెళ్లి చేస్తామంటోన్న తల్లి

గుణశేఖర్ ‘శాకుంతలం’గా అనుష్క..!

డ్రంకెన్ డ్రైవ్ టెస్టు చేయడానికి కారు ఆపారు.. కట్ చేస్తే..
డ్రంకెన్ డ్రైవ్ టెస్టు చేయడానికి కారు ఆపారు.. కట్ చేస్తే..
ఇల్లు కట్టుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్..!
ఇల్లు కట్టుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్..!
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్.. స్టార్ హీరో సతీమణి..
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్.. స్టార్ హీరో సతీమణి..
రోడ్డుపై వెళ్తూ ఒక్కసారిగా ఆగిన కారు.. కదలకపోవడంతో వెళ్లి చూస్తే
రోడ్డుపై వెళ్తూ ఒక్కసారిగా ఆగిన కారు.. కదలకపోవడంతో వెళ్లి చూస్తే
సేంద్రియ వ్యవసాయంతో అదిరే రాబడి.. ఏకంగా సంవత్సరానికి రూ.40 లక్షలు
సేంద్రియ వ్యవసాయంతో అదిరే రాబడి.. ఏకంగా సంవత్సరానికి రూ.40 లక్షలు
వేగంగావెళ్తున్నవాహనం టైర్‌ ఊడిపోయి కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టింది
వేగంగావెళ్తున్నవాహనం టైర్‌ ఊడిపోయి కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టింది
కొత్తింట్లోకి జబర్దస్త్ కమెడియన్.. సెలబ్రిటీల సందడి.. వీడియో
కొత్తింట్లోకి జబర్దస్త్ కమెడియన్.. సెలబ్రిటీల సందడి.. వీడియో
తక్కువ ధరలో 5జీ ఫోన్లు కావాలా.. ఇవిగో బెస్ట్ ఆప్షన్లు..
తక్కువ ధరలో 5జీ ఫోన్లు కావాలా.. ఇవిగో బెస్ట్ ఆప్షన్లు..
సూపర్ ఫాస్ట్ ల్యాప్‌టాప్ రిలీజ్ చేసిన లెనోవో
సూపర్ ఫాస్ట్ ల్యాప్‌టాప్ రిలీజ్ చేసిన లెనోవో
నిర్మాతగా సమంత ఫస్ట్ మూవీ ఇదే.. టైటిల్ పోస్టర్ రిలీజ్..
నిర్మాతగా సమంత ఫస్ట్ మూవీ ఇదే.. టైటిల్ పోస్టర్ రిలీజ్..