Corona: కోరుకున్న ఉద్యోగాన్ని సాధించి గెలిచాడు.. కానీ కరోనా చేతిలో ఓడిపోయాడు. కన్నీరు పెట్టిస్తోన్న అవినాష్ కథ.
Avinash Died Due To Corona: కరోనా మహమ్మారి యావత్ మానవాళిని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది. ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకునే దేశాలను సైతం ఈ మాయదారి రోగం అతలాకుతలం చేసింది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. తక్కువ వయసున్న వారు సైతం...
Avinash Died Due To Corona: కరోనా మహమ్మారి యావత్ మానవాళిని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది. ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకునే దేశాలను సైతం ఈ మాయదారి రోగం అతలాకుతలం చేసింది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. తక్కువ వయసున్న వారు సైతం ఈ వైరస్‌బారిన పడి చనిపోవడం అత్యంత దారుణమైన విషయం. కంటికి కనిపించని ఈ వైరస్ ఎంతో మంది కలలను కూల్చి వేసింది. ఒక్కో ఇటుకను పేర్చుకుంటూ నిర్మించుకున్న బంగారంలాంటి జీవితాలను నాశనం చేసింది. తాజాగా బిహార్‌లో జరిగిన ఓ సంఘటన కన్నీరు పెట్టిస్తోంది. వివరాల్లోకి వెళితే బిహార్ చెందిన అవినాష్ (30) బీటెక్ పూర్తి చేసి ఓ సంస్థలో మంచి జీతానికి ఉద్యోగంలో చేరాడు. అయితే అవినాష్‌కు మాత్రం బిహార్ పబ్లిక్ సర్వీస్ కమీషన్‌లో (బీపీఎస్‌పీ) ఉద్యోగం సాధించాలని కల ఉండేది. అందుకు అనుగుణంగానే తీవ్రంగా కష్టపడ్డాడు. ఉద్యోగాన్ని సైతం పక్కనపెట్టి కోచింగ్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన బిహార్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలకు హాజరయ్యాడు అవినాష్. అంతలోనే కరోనా బారిన పడ్డాడు. అయితే కొన్ని రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందిన అవినాష్ వైద్యుల సలహామేరకు ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ అయ్యాడు. కానీ మాయదారి రోగం మళ్లీ తిరగబెట్టింది. దీంతో ఆరోగ్యం క్షీణించడంతో జూన్ 24న శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి మృత్యువాత పడ్డాడు. అవినాష్ మరణించిన సరిగ్గా ఆరు రోజుల తర్వాత అతను రాసిన పరీక్షా ఫలితాలు వచ్చాయి. జూన్ 30న విడుదలైన బిహార్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలో అవినాష్ డిప్యూటీ కలెక్టర్ లేదా డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ హోదా ఉన్న ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అయితే ఆ కరోనా మహమ్మారి అవినాష్ సంతోషాన్ని ఆవిరి చేసింది. జీవిత ఆశయంగా భావించిన ఉద్యోగాన్ని సాధించినా.. అవినాష్‌ను జీవితంలో ఓడించింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న అవినాష్ సన్నిహితులంతా కన్నీరుమున్నీరవుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు.
Also Read: Drug Racket: నిన్న టెర్రర్ లింక్.. ఇవాళ డ్రగ్స్ మాఫియా.. ఇద్దరు విదేశీ విద్యార్థులు అరెస్ట్
Road Mishap: ఘోర రోడ్డు ప్రమాదం.. మూడేళ్ల చిన్నారి సహా ఐదుగురు దుర్మరణం\
Hyderabad Metro Timings: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక పరుగుల సమయం మారింది.. గమనించారా..