Covid-19 Vaccination: దేశంలో ముమ్మరంగా కోవిడ్ వ్యాక్సినేషన్.. 34 కోట్లకు చేరువలో టీకాల పంపిణీ..

India Covid-19 Vaccination: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో థర్డ్ వేవ్ సూచనలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిలో భాగంగా కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు

Covid-19 Vaccination: దేశంలో ముమ్మరంగా కోవిడ్ వ్యాక్సినేషన్.. 34 కోట్లకు చేరువలో టీకాల పంపిణీ..
India Covid-19 Vaccination
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 02, 2021 | 8:46 AM

India Covid-19 Vaccination: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో థర్డ్ వేవ్ సూచనలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిలో భాగంగా కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా చేపట్టింది. అంతేకాకుండా టీకాల కొరత ఏర్పడకుండా ముందస్తుగా ఆయా రాష్ట్రాలకు చేరవేసేలా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో.. వ్యాక్సినేషన్ పరంగా భారత్ మరో మైలురాయిని అధిగమించింది. ప్రస్తుతం మొత్తం వ్యాక్సిన్ డోసుల పంపిణీ 34కోట్లకు చేరువైంది. ఇప్పటివరకూ 33,96,28,356 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. గురువారంతో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ 167వ రోజుకు చేరింది. గురువారం రాత్రి 7 గంటల వరకు ఒకే రోజు 38,17,661 డోసులు అందించినట్లు కేంద్ర కుటుంబ, మంత్రిత్వశాఖ తెలిపింది. వాటిలో 18-44 సంవత్సరాల నిండిన 21,80,915 మందికి మొదటి డోసు ఇవ్వగా..84,107 మందికి రెండో డోసు అందజేసినట్లు చెప్పింది.

మూడో విడుత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి దేశవ్యాప్తంగా 9,38,32,139 మందికి మొదటి, 22,68,517 మందికి రెండో మోతాదు వేసినట్లు తెలిపింది. మొత్తంగా 18 నుంచి 44 ఏళ్లగల వారికి దేశవ్యాప్తంగా 9.61 మందికి వ్యాక్సిన్ అందించినట్లు పేర్కొంది. వారిలో 22,68,517 మందికి రెండో డోసు కూడా అందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. థర్డ్ వేవ్ ఉంటుందన్న సూచనలతో.. కరోనా మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వం వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ముమ్మరంగా నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా.. రాష్ట్రాలకు వ్యాక్సిన్ల సరఫరా, ఉత్పత్తిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ పలు సూచనలు చేస్తోంది.

Also Read:

Gold and Silver Price Today: బంగారం ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌.. మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు

TPCC: కాంగ్రెస్‌లో కోల్డ్ వార్ షురూ.. రేవంత్‌పై గుర్రుగా ఉన్న సీనియర్ నేతలు.. కలిసేందుకు నో ఛాన్స్!