Andhrapradesh: ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం.. 104 కాల్ సెంటర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ప్ర‌త్యేక అధికారులు

ఆంధ్ర‌ప్రదేశ్ లో పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న క్ర‌మంలో.. వైర‌స్ క‌ట్టడికి రాష్ట్ర ప్ర‌భుత్వం యుద్ద‌ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకుంటుంది.

Andhrapradesh:  ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం.. 104 కాల్ సెంటర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ప్ర‌త్యేక అధికారులు
AP-Government-
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 25, 2021 | 7:51 PM

ఆంధ్ర‌ప్రదేశ్ లో పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న క్ర‌మంలో.. వైర‌స్ క‌ట్టడికి రాష్ట్ర ప్ర‌భుత్వం యుద్ద‌ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకుంటుంది. ఇప్ప‌టికే వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేసి.. కోవిడ్ ఆస్ప‌త్రుల సంఖ్య‌ను పెంచింది. ఆక్సిజ‌న్ కొర‌త రాకుండా ఏర్పాట్లు ప్రారంభించింది. మ‌రోవైపు ప్రతి జిల్లాలో 104 కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కొవిడ్ కేర్ సెంట‌ర్లు, ఆస్పత్రులు, పడకలు, అంబులెన్స్‌ల వివరాల కోసం 104 కాల్‌ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. హోమ్ ఐసొలేషన్, హోమ్ క్వారంటైన్‌, వ్యాక్సినేషన్ సెంట‌ర్ల‌ వివరాల సేవలకు 104 కాల్‌ సెంటర్లు పనిచేయనున్నాయి. 104 కాల్ సెంటర్ పర్యవేక్షణకు స్పెష‌ల్ ఆఫీస‌ర్ల‌ను నియమించారు. 104 కాల్ సెంటర్ నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు గ‌వ‌ర్నమెంట్ తెలిపింది. 104కు కాల్ చేసిన వెంటనే చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆంధ్రాలో క‌రోనా క‌ల్లోలం…

ఏపీలో కరోనా క‌ల్లోలం కొనసాగుతోంది. రోజురోజుకీ వైరస్బారిన పడుతోన్న బాధితుల సంఖ్య ప్ర‌మాద‌క‌రంగా పెరుగుతోంది. మృతుల సంఖ్య కూడా క‌ల‌వ‌ర‌పెడుతోంది. కొత్త‌గా రాష్ట్ర వ్యాప్తంగా 62,885 టెస్టులు చేయ‌గా.. 12,634 కేసులు వెలుగుచూశాయి. మ‌రో 69 మంది వైర‌స్ కార‌ణంగా ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 10,33,560 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

Also Read: కొడుకు ఆడుకోడానికి బొమ్మ కారు అడిగితే… తండ్రి ఏకంగా నిజం కారే చేసి ఇచ్చాడు

పెద్ద విష‌పు పామును ముప్పుతిప్ప‌లు పెట్టిన చిన్న గండు చీమ‌.. మెడ‌పై గ‌ట్టిగా కొరికి.. కొరికి