Viral News: కొడుకు ఆడుకోడానికి బొమ్మ కారు అడిగితే… తండ్రి ఏకంగా నిజం కారే చేసి ఇచ్చాడు
పిల్లల్ని ఆశ్చర్యపరచాలని తల్లిదండ్రులు ఆరాడటపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఊహించని గిఫ్ట్స్ ఇచ్చి వారిని ఎగ్జైట్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మేము చెప్పబోయే ఓ తండ్రి...
పిల్లల్ని ఆశ్చర్యపరచాలని తల్లిదండ్రులు ఆరాడటపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఊహించని గిఫ్ట్స్ ఇచ్చి వారిని ఎగ్జైట్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మేము చెప్పబోయే ఓ తండ్రి మాత్రం పూర్తి డిఫరెంట్. తన కొడుకు ఓ జీపు బొమ్మ అడిగితే.. ఏకంగా రియల్ జీపునే తయారు చేసిచ్చాడు. వివరాల్లోకి వెళ్తే.. కేరళ మలప్పురమ్ జిల్లా ఉరాంగట్టిరి గ్రామానికి చెందిన షకీర్.. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి 6 ఏళ్ల క్రితం తిరిగి సొంతూరు వచ్చాడు. ఈ క్రమంలోనే తన తనయుడు ఆడుకునేందుకు బొమ్మ జీపు అడగగా.. ఏకంగా నిజమైన మినీ జీపును తయారు చేసి.. అతడ్ని ఆశ్యర్యపరిచాడు. అయితే.. ప్రస్తుతం ఈ జీపు విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఖతార్‌లో వర్క్ చేస్తున్న సమయంలో అక్కడి ఇళ్లల్లో ఇలాంటి బొమ్మ జీపులు చూశానని, అలాంటిది తన కొడుక్కి తయారు చేయాలని అప్పుడే డిసైడయినట్లు తెలిపాడు షకీర్.
సొంతూరు వచ్చాక.. జీపు తయారు చేసేందుకు కావాల్సిన సామగ్రి కోసం ఢిల్లీ సహా ఇతర సిటీలు వెళ్లి సరంజామా తెచ్చుకున్నాడు. ఇతర పనులు చేసుకుంటూనే.. జీపు తయారు చేయటం ప్రారంభించాడు. దాన్ని కంప్లీట్ చేసేందుకు ఏడాది సమయం పట్టింది. అయితే మరే పనులు పెట్టుకోకుండా ఉంటే మూడు నెలల్లోనే పూర్తి చేయొచ్చని తెలిపాడు షకీర్.
జీపు తయారీ కోసం పాత బజాబ్ బైక్ ఇంజిన్ వినియోగించాడు షకీర్. జీపు కోసం మొత్తం రూ.1.70 లక్షలు ఖర్చు చేశాడట. ఒక లీటర్ పెట్రోల్‌తో 35 కిలోమీటర్లు, రోడ్డు బాగుంటే 40 కిలోమీటర్ల వరకూ మైలేజీ వస్తుందని షకీర్ వివరించాడు. అయితే.. తన ఇంటి నిర్మాణం జరుగుతున్న క్రమంలో ఆ జీపును కొట్టక్కల్‌కు చెందిన ఓ వ్యక్తికి రూ.2 లక్షలకు అమ్మాల్సి వచ్చిందని వెల్లడించాడు. చాలా మంది తమకు అలాంటి మినీ జీపు తయారు చేసి ఇవ్వాలని షకీర్‌ను అడుగుతున్నారట. ప్రస్తుతం పెట్రోల్ అవసరం లేకుండా నడిచే ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో బిజీగా ఉన్నాడు షకీర్.
Also Read: పెద్ద విషపు పామును ముప్పుతిప్పలు పెట్టిన చిన్న గండు చీమ.. మెడపై గట్టిగా కొరికి.. కొరికి
వింత దేశం: ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే వరుడు తిమింగలం చేపల పళ్ళు తీసుకురావాలి