Viral: నిద్రిస్తున్న సింహంతో ఆట.. తోక పట్టుకుని లాగి.. పరుగెత్తిన నక్క.. నవ్వులు పూయిస్తున్న వైరల్ వీడియో.!

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని షాక్ కు..

Viral: నిద్రిస్తున్న సింహంతో ఆట.. తోక పట్టుకుని లాగి.. పరుగెత్తిన నక్క.. నవ్వులు పూయిస్తున్న వైరల్ వీడియో.!
Jackal
Ravi Kiran

|

Apr 26, 2021 | 9:27 AM

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని షాక్ కు గురయ్యే విధంగా ఉంటే, మరికొన్ని క్యూట్ గా ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసే ఇలాంటి కంటెంట్ నెటిజన్లను ఎప్పటికప్పుడు అబ్బురపరుస్తూ ఉంటుంది. ఇక తాజాగా సింహం, నక్క వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

అడవికి రాజు అయిన సింహానికి ఎదురు వెళ్లాలంటేనే చాలా జంతువులు భయపడతాయి. దాన్ని దూరం నుంచి చూస్తేనే పరుగుపెడతాయి. అలాంటిది ఓ నక్క ఆ సింహం తోకతో ఆడుకుంది. గాఢ నిద్రలో ఉన్న దాన్ని భయపెట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇందులో ఓ సింహం చెట్టు చాటున గాఢ నిద్రలో ఉండగా.. ఎక్కడ నుంచో వచ్చిన ఓ నక్క దాని తోకను లాగి పారిపోతుంది. ఏమి జరుగుతోందని సింహం గ్రహించేలోపే నక్క అక్కడ నుంచి పరిగెత్తేస్తుంది. ఈ ఫన్నీ వీడియోను నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. వరుసపెట్టి కామెంట్స్ చేయడమే కాకుండా రీ-ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu