AP Corona Cases: ఏపీలో క‌రోనా క‌ల్లోలం.. కొత్తగా 11,698 పాజిటివ్ కేసులు, భారీగా మ‌ర‌ణాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కొత్త‌గా రాష్ట్ర వ్యాప్తంగా 50,972 టెస్టులు చేయ‌గా.. 11, 698 కేసులు వెలుగుచూశాయి. కొత్త‌గా వైర‌స్ కార‌ణంగా 37 మంది ప్రాణాలు విడిచారు

AP Corona Cases: ఏపీలో క‌రోనా క‌ల్లోలం.. కొత్తగా 11,698 పాజిటివ్ కేసులు, భారీగా మ‌ర‌ణాలు
Ap Corona
Follow us

|

Updated on: Apr 24, 2021 | 7:53 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కొత్త‌గా రాష్ట్ర వ్యాప్తంగా 50,972 టెస్టులు చేయ‌గా.. 11, 698 కేసులు వెలుగుచూశాయి. కొత్త‌గా వైర‌స్ కార‌ణంగా 37 మంది ప్రాణాలు విడిచారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 10,20,926 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శ‌నివారం వెల్లడించింది. వైర‌స్ కార‌ణంగా తూర్పు గోదావరి, నెల్లూరులో ఆరుగురు చొప్పున.. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో నలుగురు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున చ‌నిపోయారు. గుంటూరు, కృష్ణ, కర్నూలు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున.. ప్రకాశం జిల్లాలో ఒక్కరు ప్రాణాలు విడిచారు. తాజా మ‌ర‌ణాల‌తో క‌లిసి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మృతుల సంఖ్య 7,616కి చేరింది.

కొత్త‌గా 4,421 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,31,839కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 81,471 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,59,31,722 నమూనాలను టెస్ట్ చేసిన‌ట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. అత్యధికంగా గుంటూరులో 1,581, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 292 కేసులు వెలుగుచూశాయి.

Also Read: ఇంట‌ర్వ్యూతో సౌత్ సెంట్ర‌ల్ రైల్వేలో మెడిక‌ల్ స్టాఫ్ ఉద్యోగాలు.. రిజిస్ట్రేష‌న్ ఎప్ప‌టి నుంచటే..

సేవింగ్స్ ఎకౌంట్ లో ఎక్కువ వడ్డీ అందించే బ్యాంకులు ఇవే.. షరతులు వర్తిస్తాయి!