VSSC Recruitment 2022: విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో 194 అప్రెంటిస్‌ పోస్టులకు నేడే ఇంటర్వ్యూలు.. ఎక్కడంటే..

కేంద్ర ప్రభుత్వ విభాగానికి చెందిన కేరళలోని తిరువనంతపురంలోనున్న విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ 194 గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులకు నిర్వహించే ఇంటర్వ్యూ నేడే. ఆసక్తి కలిగిన వారు ఈ రోజు..

VSSC Recruitment 2022: విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో 194 అప్రెంటిస్‌ పోస్టులకు నేడే ఇంటర్వ్యూలు.. ఎక్కడంటే..
VSSC Recruitment 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 12, 2022 | 8:12 AM

కేంద్ర ప్రభుత్వ విభాగానికి చెందిన కేరళలోని తిరువనంతపురంలోనున్న విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ 194 గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులకు నిర్వహించే ఇంటర్వ్యూ నేడే. ఎయిరోనాటికల్‌/ఎయిరోస్పేస్‌ ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌/ఇంజనీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌, మెటలర్జీ, ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌, ఫైర్‌ అండ్‌ సేఫ్టీ ఇంజనీరింగ్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌/కేటరింగ్‌ టెక్నాలజీ, ఫైనాన్స్‌ అండ్‌ ట్యాక్సేషన్‌, కంప్యూటర్‌ అప్లికేషన్‌ విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ రోజు (నవంబర్‌ 12) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 65 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌ డిగ్రీ, 60 శాతం మార్కులతో హోటల్‌ మేనేజ్‌మెంట్‌/కేటరింగ్‌ టెక్నాలజీ డిగ్రీ, 60 శాతం మార్కులతో ఫైనాన్స్‌ అండ్‌ ట్యాక్సేషన్‌/కంప్యూటర్‌ అప్లికేషన్‌ స్పెషలైజేషన్‌లో బీకాం లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొందినవారు ఎవరైనా నేరుగా కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చు. ఐతే అభ్యర్ధులు తప్పనిసరిగా 2020 ఏప్రిల్‌కు ముందు ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి.

అలాగే సంబంధిత పనిలో విభాగంలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 30 యేళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా అధికారిక వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.9000ల చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్‌: Main Auditorium, St.Mary’s Higher Secondary School, Pattom, Thiruvananthapuram, Kerala.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.