UPSC Job Notification 2025: ఎలాంటి రాత పరీక్షలేకుండా యూపీఎస్సీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. డిగ్రీ అర్హత ఉంటే చాలు
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న రీసెర్చ్ ఆఫీసర్, అసిస్టెంట్ మైనింగ్ ఇంజినీర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజికల్ ఆర్కిటెక్ట్, ట్రైనింగ్ ఆఫీసర్, డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజికల్ ఇంజినీర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది..

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న రీసెర్చ్ ఆఫీసర్, అసిస్టెంట్ మైనింగ్ ఇంజినీర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజికల్ ఆర్కిటెక్ట్, ట్రైనింగ్ ఆఫీసర్, డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజికల్ ఇంజినీర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 84 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు ఈ రోజు (మే 10వ తేదీ) నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఆర్క్, బీటెక్, బీఈ, డిప్లొమా, బీఏఎంఎస్, బీయూఎంఎస్, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్‌లో ఉత్తీర్ణత కలిగిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి. వయోపరిమితి కింద అభ్యర్ధులకు 35 నుంచి 55 ఏళ్లుగా నిర్ణయించారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా మే 29, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.25 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
ఖాళీ పోస్టుల వివరాలు..
- రీసెర్చ్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 1
- డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజికల్ ఆర్కిటెక్ట్ పోస్టుల సంఖ్య: 2
- డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజికల్ ఇంజినీర్ పోస్టుల సంఖ్య: 15
- ప్రొఫెసర్(కెమికల్ ఇంజినీరింగ్) పోస్టుల సంఖ్య: 1
- సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 1
- అసిస్టెంట్ ప్రొఫెసర్(కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్) పోస్టుల సంఖ్య: 1
- అసిస్టెంట్ ప్రొఫెసర్(సాయిల్ మెకానిక్స్) పోస్టుల సంఖ్య: 1
- మెడికల్ ఆఫీసర్(ఫీమేల్) పోస్టుల సంఖ్య: 3
- సైంటిస్ట్-బి(ఫారెన్సిక్ సైకాలజీ) పోస్టుల సంఖ్య: 2
- అసిస్టెంట్ డైరెక్టర్(సేఫ్టీ) పోస్టుల సంఖ్య: 2
- అసిస్టెంట్ మైనింగ్ ఇంజినీర్(మైన్స్) పోస్టుల సంఖ్య: 3
- అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 1
- సీనియర్ అసిస్టెంట్ (కంట్రోలర్ ఆఫ్ మైన్స్) పోస్టుల సంఖ్య: 2
- ఇంజినీర్ & షిప్ సర్వేయర్-కమ్ డిప్యూటీ జనరల్(టెక్నికల్) పోస్టుల సంఖ్య: 2
- ట్రైనింగ్ ఆఫీసర్(ఎక్సెప్ట్ ఉమెన్ ట్రైనింగ్) పోస్టుల సంఖ్య: 4
- ట్రైనింగ్ ఆఫీసర్(ఫిట్టర్) పోస్టుల సంఖ్య: 21
- ట్రైనింగ్ ఆఫీసర్(మెకానిక్ డీసిల్) పోస్టుల సంఖ్య: 4
- ట్రైనింగ్ ఆఫీసర్(మెషనిస్ట్) పోస్టుల సంఖ్య: 1
- ట్రైనింగ్ ఆఫీసర్(ప్లంబర్) పోస్టుల సంఖ్య: 3
- ట్రైనింగ్ ఆఫీసర్(సీవింగ్ టెక్నాలజీ) పోస్టుల సంఖ్య: 4
- మెడికల్ ఆఫీసర్(ఆయుర్వేద) పోస్టుల సంఖ్య: 9
- మెడికల్ ఆఫీసర్(యునాని) పోస్టుల సంఖ్య: 1
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.https://tv9telugu.com/career-jobs








