UPSC Recruitment 2022: డిగ్రీ అర్హతతో 161 కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

కేంద్ర ప్రభుత్వ విభాగానికి చెందిన యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని.. వైస్ ప్రిన్సిపాల్‌ (Vice Principal Posts) తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

UPSC Recruitment 2022: డిగ్రీ అర్హతతో 161 కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
Upsc
Follow us
Srilakshmi C

|

Updated on: May 29, 2022 | 8:38 AM

UPSC Vice-Principal Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ విభాగానికి చెందిన యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని.. వైస్ ప్రిన్సిపాల్‌ (Vice Principal Posts) తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 161

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు:

  • డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు: 3
  • అసిస్టెంట్ కీపర్ పోస్టులు: 1
  • కెమిస్ట్రీలో మాస్టర్ పోస్టులు: 1
  • మినరల్ ఆఫీసర్ పోస్టులు: 20
  • అసిస్టెంట్ షిప్పింగ్ మాస్టర్ మరియు అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు: 2
  • సీనియర్ లెక్చరర్ పోస్టులు: 2
  • వైస్ ప్రిన్సిపాల్ పోస్టులు: 131
  • సీనియర్ లెక్చరర్ పోస్టులు: 1

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టునుబట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ/పీజీ డిగ్రీ/బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌/ఎండీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్‌ అభ్యర్ధులకు: రూ.25
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 16, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.