Powergrid Recruitment 2022: నిరుద్యోగులకు బంపరాఫర్‌! పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు చెందిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (Powergrid).. అసిస్టెంట్ ఆఫీసర్‌ ట్రైనీ ( Assistant Officer Trainee Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

Powergrid Recruitment 2022: నిరుద్యోగులకు బంపరాఫర్‌! పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు..
Powergrid
Follow us
Srilakshmi C

|

Updated on: May 29, 2022 | 8:56 AM

Powergrid Assistant Officer Trainee (Law) Recruitment 2022: భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు చెందిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (Powergrid).. అసిస్టెంట్ ఆఫీసర్‌ ట్రైనీ ( Assistant Officer Trainee Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 8

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ఇంజినీర్ ట్రయినీ పోస్టులు

వయోపరిమితి: జూన్‌ 18, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 28 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: మూడేళ్ల ఎల్ఎల్బీ లేదా దేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఫైనల్ ఇయర్‌ స్టూడెంట్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే క్లాట్‌ 2022 పరీక్షలో వ్యాలిడ్‌ స్కోర్ సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: CLAT 2022 స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • ఓబీసీ, ఇతర అభ్యర్ధులు రూ. 500 చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూసీ అభ్యర్ధులు ఎటువంటి ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 18, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.