AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IAS Interview Questions: ఏ మరక మంచిది.. సమాధానం మీకు తెలుసా? ఐఏఎస్ ఇంటర్వ్యూలో ఇలాంటి ట్రిక్కీ ప్రశ్నలెన్నో?

అయితే ఈ ప్రశ్నలు చూడ్డానికి చాలా ఈజీగానే సమాధానం చెప్పవచ్చని అనుకుంటాం. కానీ, ఆ సమధానంలో చాలా మతలబులు ఉంటాయి. ఈ ప్రశ్నలకు చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది.

IAS Interview Questions: ఏ మరక మంచిది.. సమాధానం మీకు తెలుసా? ఐఏఎస్ ఇంటర్వ్యూలో ఇలాంటి ట్రిక్కీ ప్రశ్నలెన్నో?
Upsc Exam
Venkata Chari
|

Updated on: Feb 05, 2022 | 7:39 PM

Share

IAS Interview Questions: చాలా మంది అభ్యర్థులు యూపీఎస్‌సీ (UPSC) పరీక్షకు చాలా సంవత్సరాలుగా సిద్ధమవుతుంటుంటారు. అయితే పరీక్షలోని మూడు దశలను మొదటి ప్రయత్నంలోనే క్లియర్ చేయడం అంత సులభం కాదు. ఐఏఎస్ (IAS) స్థాయి ఇంటర్వ్యూని ఎదుర్కొవాలంటే మాత్రం ప్రిపరేషన్ కూడా అదే స్థాయిలో (IAS Interview) ఉండాలి. ఇంటర్వ్యూ ప్యానెల్‌లో కూర్చున్న నిపుణులు మీ తార్కిక సామర్థ్యాన్ని (UPSC Interview) పరీక్షించడానికి చాలా కఠినమైన ప్రశ్నలను అడుగుతుంటుంటారు. అయితే ఇవి చూడ్డానికి చాలా ఈజీగానే సమాధానం చెప్పవచ్చని అనుకుంటాం. కానీ, ఆ సమధానంలో చాలా మతలబులు ఉంటాయి. ఈ ప్రశ్నలకు చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది.

ఇలాంటి ప్రశ్నలు తరచుగా యూపీఎస్‌సీ ఇంటర్వ్యూలలో వింటుంటాం. ఇంటర్వ్యూ చేసేవారి ప్రశ్న సులభంగా ఉంటుంది. కానీ, అభ్యర్థులు సమాధానం చెప్పడంలో మాత్రం తప్పులు చేస్తుంటుంటారు. యూపీఎస్‌సీ ఇంటర్వ్యూలో అడిగే కొన్ని ప్రశ్నలను ఇప్పుడు చూద్దాం.

ప్రశ్న- ఏ మరక మంచిది? సమాధానం- ఓటు వేసిన తర్వాత మన చేతుల్లో వేసే సిరా మంచిది. ఎందుకంటే ఈ మరక మనకు సమానత్వ హక్కును ఇస్తుంది.

ప్రశ్న- జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అంటే ఏమిటి?

సమాధానం – వ్యవసాయ రంగంలో ఇదొక కొత్త పద్ధతి. వ్యవసాయంలో సహజమైన వస్తువులను ఉపయోగించడం దీని ఉద్దేశ్యం. దీనికి ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది.

ప్రశ్న- అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ కంటే ఏ రాష్ట్రం పెద్దది? సమాధానం- జనాభా ప్రకారం అస్సాం పెద్దది. వైశాల్యం ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ పెద్దది.

ప్రశ్న- ఏ జంతువు పుట్టిన తర్వాత 2 నెలలు నిద్రిస్తుంది? సమాధానం – ఎలుగుబంటి

ప్రశ్న- నీటిలో పడిపోయినా తడవని వస్తువు ఏమిటి? సమాధానం- అభ్యర్థులు ఈ ప్రశ్నకు చాలా తెలివిగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. సమాధానం ఏంటంటే షాడో.

Also Read: APSSDC Jobs: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. టెక్‌ మహీంద్రలో ఉద్యోగాల భర్తీకి రేపే జాబ్‌ మేళా..

MBBS 2021-2022: విద్యా సంవత్సరం కుదింపు.. సెలవుల్లో కోత.. కరోనా వ్యాప్తి దృష్ట్యా నిర్ణయం