UPSC CSE 2021 Result: సివిల్స్ పరీక్షల్లో మెరిసన తెలుగు తేజాలు.. వారి సక్సెస్ వెనక..
UPSC Civils Telugu students: శృతి శర్మకు ఫస్ట్ ర్యాంక్ రాగా, అంకితా అగర్వాల్, గామిని సింగ్లాలకు రెండవ, మూడవ ర్యాంక్‌లు దక్కించుకున్నారు. సివిల్స్‌లో 685 మంది అభ్యర్థులు క్వాలిఫై అయినట్లు యూపీఎస్సీ..

సివిల్స్ పరీక్షల్లో అమ్మాయిలు అదరగొట్టారు. మొదటి మూడు ర్యాంక్‌లను మహిళలే చేజిక్కించుకున్నారు. యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ -2021 తుది ఫలితాలు వెల్లడయ్యాయి. శృతి శర్మకు ఫస్ట్ ర్యాంక్ రాగా, అంకితా అగర్వాల్, గామిని సింగ్లాలకు రెండవ, మూడవ ర్యాంక్‌లు దక్కించుకున్నారు. సివిల్స్‌లో 685 మంది అభ్యర్థులు క్వాలిఫై అయినట్లు యూపీఎస్సీ వెల్లడించింది. ఇందరులో మన తెలుగు రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉన్నారు. వారిలో యశ్వంత్ కుమార్ రెడ్డి 15 వ ర్యాంకు సాధించగా పూసపాటి సాహిత్య 24వ ర్యాంక్, కొప్పిశెట్టి కిరణ్మయి 56, శ్రీపూజ 62, గడ్డం సుధీర్ కుమార్ రెడ్డి 69, ఆకునూరి నరేశ్ 117, అరుగుల స్నేహ 136, బి చైతన్య రెడ్డి 161, ఎస్ కమలేశ్వర్ రావు 297, విద్యామరి శ్రీధర్ 336, దిబ్బడ అశోక్ 350, గూగులావత్ శరత్ నాయక్ 374, నల్లమోతు బాలకృష్ణ 420, ఉప్పులూరి చైతన్య 470, మన్యాల అనిరుధ్ 564, బిడ్డి అఖిల్ 566, రంజిత్ కుమార్ 574, పాండు విల్సన్ 602, బాణావాత్ అరవింద్ 623, బచ్చు స్మరణ్‌రాజ్ 676వ ర్యాంకు సాధించారు.
ఇందులో వరంగల్ జిల్లాకు చెందిన బొక్క చైతన్య రెడ్డికి సివిల్స్ లో 161 రాంక్ సాధించారు. ఈమె తండ్రి బి. సoజీవ రెడ్డి వరంగల్ డీసీఓగా పని చేశారు. ప్రస్తుతం చైతన్య నీటిపారుదల శాఖలో ఏ.ఈ గా పనిచేస్తున్నారు.
మరో అమ్మాయి తిరుమాని శ్రీపూజ సివిల్ సర్వీసెస్ ఆలిండియా 62nd ర్యాంక్ దక్కించుకున్నారు. తండ్రి వెంకటేశ్వర్లు… పంచాయితీరాజ్ శాఖలో పని చేస్తున్నారు. స్వంత గ్రామం భీమవరం మండలం దొంగపిండి గ్రామం.
ఇక జగిత్యాల జిల్లాకు చెందిన గూగులావత్ శరత్ నాయక్ సివిల్స్ లో 374వ ర్యాంక్ సాధించారు. శరత్ స్వగ్రామం బీర్పూరర్ మండలంలోని చర్లపల్లి గ్రామం. తండ్రి భాస్య నాయక్ ఓ రైతు. తల్లి యమున మినీ అంగన్వాడీ కార్యకర్తగా పని చేస్తున్నారు.



