NRDC Recruitment 2022: రూ.లక్షకుపైగా జీతంతో.. నేషనల్ రిసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో కొలువులు..పూర్తి వివరాలివే!
భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్ రిసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NRDC).. సైంటిఫిక్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్ తదితర (Scientific Officer Posts)..
NRDC Scientific Officer Recruitment 2022: భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్ రిసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NRDC).. సైంటిఫిక్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్ తదితర (Scientific Officer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 13
పోస్టుల వివరాలు: సైంటిఫిక్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, మేనేజర్, అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంటెంట్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 26 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.21,184ల నుంచి రూ.1,80,000 వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, బీకాం, ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈమెయిల్/ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ మెయిల్ ఐడీ: jobs@nrdc.in
అడ్రస్: నేషనల్ రిసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, జమ్రూద్‌పూర్ కమ్యూనిటీ, న్యూదిల్లీ-110048.
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 16, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.