UPSC CSE 2024 Notification: నేడే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్ విడుదల.. ప్రిలిమ్స్ పరీక్ష తేదీ ఇదే
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్‌ఈ), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఈ రోజు (ఫిబ్రవరి 14) విడుదల చేయనుంది. యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 14న నోటిఫికేషన్ వెలువడనుండగా.. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ కూడా ఈ రోజు నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 5వ తేదీ వరక కొనసాగనుంది..
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్‌ఈ), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఈ రోజు (ఫిబ్రవరి 14) విడుదల చేయనుంది. యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 14న నోటిఫికేషన్ వెలువడనుండగా.. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ కూడా ఈ రోజు నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 5వ తేదీ వరక కొనసాగనుంది. మే 26 ప్రిలిమినరీ రాత పరీక్ష జరుగుతుంది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్‌తోపాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ నోటిఫికేషన్ కూడా ఈ రోజే విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ సివిల్ సర్వీసులకు చెందిన ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.
కాగా గతేడాది దాదాపు 1,105 ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌లో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిగ్రీ చివరి యేడాది చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు దారుల వయోపరిమితి 21 ఏళ్లు నిండి ఉండాలి. అలాగే 32 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్ విడుదలైన తర్వాత పోస్టుల సంఖ్య, కేటగిరీల వారీగా వయోపరిమితి, సిలబస్, పరీక్ష తేదీలు వంటి ఇతర ముఖ్యమైన వివరాలు వివరణాత్మకంగా తెలుసుకోవచ్చు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ సెప్టెంబర్ 20వ తేదీ నుంచి వరుసగా ఐదు రోజులు నిర్వహించే అవకాశం ఉంది. కాగా ప్రతీయేట వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ద్వారా ఈ కింది సర్వీసుల్లో ఖాళీలను భర్తీ చేస్తారు.
యూపీఎస్సీ సర్వీసులు ఇవే..
- ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్
- ఇండియన్ ఫారిన్ సర్వీస్
- ఇండియన్ పోలీస్ సర్వీస్
- ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్
- ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్
- ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్
- ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్
- ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్
- ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్
- ఇండియన్ పోస్టల్ సర్వీస్
- ఇండియన్ పి అండ్ టి అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్
- ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్
- ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్ అండ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్)
- ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఇన్‌కం ట్యాక్స్)
- ఇండియన్ ట్రేడ్ సర్వీస్
- ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్
- ఆర్మ్‌డ్ ఫోర్సెస్ హెడ్‌క్వార్టర్స్ సివిల్ సర్వీస్
- ఢిల్లీ, అండమాన్ అండ్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, డామన్ అండ్ డయ్యూ, దాద్రా అండ్ నగర్ హవేలీ సివిల్ సర్వీస్
- ఢిల్లీ, అండమాన్ అండ్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, డామన్ అండ్ డయ్యూ, దాద్రా అండ్ నగర్ హవేలీ పోలీస్ సర్వీస్
- పాండిచ్చేరి సివిల్ సర్వీస్
- పాండిచ్చేరి పోలీస్ సర్వీస్
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.