UPSC Answer Key: యూపీఎస్సీ కీలక ప్రకటన.. ఇక ప్రిలిమ్స్ ముగిసిన వెంటనే ఆన్సర్ కీ విడుదల
సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్షలు ముగిసిన వెంటనే తాత్కాలిక సమాధాన కీని విడుదల చేయడానికి యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ( UPSC ) అంగీకరించింది. దీంతో ఇకపై సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు పూర్తయిన వెంటనే తాత్కాలిక జవాబు కీని విడుదల చేయనుంది. ఈ మేరకు యూపీఎస్సీ ప్రకటన..

హైదరాబాద్, అక్టోబర్ 5: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్షలు ముగిసిన వెంటనే తాత్కాలిక సమాధాన కీని విడుదల చేయడానికి యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ( UPSC ) అంగీకరించింది. దీంతో ఇకపై సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు పూర్తయిన వెంటనే తాత్కాలిక జవాబు కీని విడుదల చేయనుంది. ఈ మేరకు యూపీఎస్సీ ప్రకటన జారీ చేసింది. పరీక్షల పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. యూపీఎస్సీ ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం ప్రకారం పరీక్షల ప్రక్రియ పూర్తయ్యే వరకు కీ విడుదల చేయడం లేదు. అంటే తుది ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రమే ఆన్సర్ కీ విడుదల చేస్తుంది. సివిల్ సర్వీసెస్ పరీక్ష మొత్తం ప్రక్రియ ముగిసిన తర్వాత పరీక్ష మార్కులు, కట్-ఆఫ్ మార్కులు, సమాధాన కీ ప్రచురించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండటం లేదు.
దీనిపై పలువురు అభ్యర్ధులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ముందు దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌లో కమిషన్ ఈ విషయాన్ని తెలియజేసింది. ప్రిలిమినరీ పరీక్షకు తాత్కాలిక సమాధాన కీని పరీక్ష జరిగిన ఒక రోజు తర్వాత ప్రచురించనున్నట్లు కమిషన్ వెల్లడించింది. జవాబు కీలు, కట్-ఆఫ్ స్కోర్లు, అభ్యర్థుల మార్కులను బహిర్గతం చేయడం వల్ల పరీక్ష హేతుబద్ధమైన, నిరూపించదగిన కారణాల ఆధారంగా తప్పుడు మూల్యాంకనాలకు ‘సమర్థవంతమైన’ పరిష్కారాలను చూపడానికి అభ్యర్థులకు అవకాశం ఉంటుంది.
ఏపీలో ఆయుష్ విద్యార్థుల స్టైపెండ్ పెంపు.. ఎంతంటే?
ఆంధ్రప్రదేశ్‌లోని ఆయుష్ విద్యాలయాల్లో చదువుతున్న హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైపెండ్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. హౌస్ సర్జన్ల స్టైపెండ్ రూ.22,527 నుంచి రూ.25,906కి పెంచింది. పోస్టు గ్రాడ్యుయేట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల స్టైపెండ్ రూ.50,686 నుంచి రూ.60,823కి పెంచింది. సెకండ్ ఇయర్ విద్యార్థులకు రూ.53,503 నుంచి రూ.61,528, థార్డ్ ఇయర్ విద్యార్థులకు రూ.56,319 నుంచి రూ.64,767 పెంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




