Fake University List: నకిలీ యూనివర్సిటీలకు కేరాఫ్ అడ్రస్‌గా ఆ రాష్ట్రం.. కీలక ప్రకటన చేసిన కేంద్రం..
Fake University List: దేశంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా.. నకిలీ విశ్వవిద్యాలయాలు కోకొల్లలుగా వెలుస్తున్నాయి.
Fake University List: దేశంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా.. నకిలీ విశ్వవిద్యాలయాలు కోకొల్లలుగా వెలుస్తున్నాయి. ఈ నకిలీ యూనివర్సిటీల కారణంగా ఎంతో విద్యార్థుల జీవితాలు అస్తవ్యస్థంగా మారుతున్నాయి. అదే సమయంలో ఏమాత్రం ప్రతిభ లేని వారు అందలమెక్కుతున్నారు. కాగా, ఈ నకిలీ విశ్వవిద్యాలయాలకు సంబంధించి తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశ వ్యాప్తంగా యూనియన్ గ్రాంట్ కమిషన్ 24 ఫేక్ యూనివర్సిటీలను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయని తెలిపారు.
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో దేశంలో నకిలీ విశ్వవిద్యాలయాలకు సంబంధించి లోక్ సభలో పలువురు ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నలకు సమాధానంగా కేంద్రం కీలక ప్రకటన చేసింది. లోక్‌సభ సభ్యులు అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 8 ఫేక్ యూనివర్సిటీలను యూజీసీ గుర్తించినట్లు వెల్లడించారు. ఇక ఢిల్లీలో 7, ఒడిశాలో 2, పశ్చిమ బెంగాల్‌లో 2, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలో ఒక్కో నకిలీ యూనివర్సిటీలను గుర్తించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సాధారణ ప్రజలు, మీడియా ఫిర్యాదుల ద్వారా ఫేక్ యూనివర్సిటీలను గుర్తించినట్లు లోక్‌సభలో కేంద్రం తెలిపింది.
Also read:
Tokyo Olympics 2020 Live: నాలుగో క్వార్టర్‌లో బెల్జియం మరో గోల్.. భారత్ పై 3-2 ఆధిక్యం
Ram Charan: శంకర్-చరణ్ మూవీ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. సెట్స్ పైకి వెళ్లేది అప్పుడే..