AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Jobs: ఏపీ ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగాలు.. నెలాఖరులోగా 3,390 నియామకాల కోసం చర్యలు..!

AP Jobs: ఏపీలో నిరుద్యోగులకు ఇది శుభవార్తే. ప్రభుత్వం ఉద్యోగ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. దీంతో సర్కార్‌ భారీగా ఉద్యోగ నియమాకాలను చేపట్టింది..

AP Jobs: ఏపీ ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగాలు.. నెలాఖరులోగా 3,390 నియామకాల కోసం చర్యలు..!
Subhash Goud
|

Updated on: Aug 03, 2021 | 9:17 AM

Share

AP Jobs: ఏపీలో నిరుద్యోగులకు ఇది శుభవార్తే. ప్రభుత్వం ఉద్యోగ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. దీంతో సర్కార్‌ భారీగా ఉద్యోగ నియమాకాలను చేపట్టింది. ఇప్పటికే 2,900 మంది మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌ (ఎంఎల్‌హెచ్‌పీలు)ను నియామకం చేపట్టిన ప్రభుత్వం.. ఈ నెలాఖరుకల్లా మరో 3,390 మంది ఉద్యోగులను నియమించుకోబోతోంది. డిసెంబర్‌ చివరికి వైద్య, ఆరోగ్య శాఖలో వివిధ విభాగాలకు చెందిన 6 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ఈ చర్యలు చేపట్టింది.

ఎంఎల్‌హెచ్‌పీల నియామకం కోసం ఆర్థిక శాఖకు లేఖ రాసింది. దీనికి ఆర్థిక శాఖ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే అన్ని జిల్లాల్లో నోటిఫికేషన్‌లు జారీ చేసి 3,390 మంది ఎంఎల్‌హెచ్‌పీలను నియమించుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఆగస్ట్‌ చివరి నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేసి ఎంఎల్‌హెచ్‌పీల ద్వారా సేవలందించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ప్రతి వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లో బీఎస్సీ నర్సింగ్‌ అర్హత ఉన్న ఒక ఎంఎల్‌హెచ్‌పీతో పాటు ఒక ఏఎన్‌ఎం ఉంటారు. ఈ క్లినిక్‌లలో 12 రకాల సేవలు, 65 రకాల మందులు, 14 రకాల నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

ఇవీ కూడా చదవండి

Telangana CET Exams: నేటి నుంచి తెలంగాణలో సెట్ ఎగ్జామ్స్.. ఇవాళ ఈసెట్ పరీక్ష..

Exams In Telangana: తెలంగాణలో మొదలైన పరీక్షల సందడి.. ఈ నెలంతా ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌తో బిజీ బిజీ..

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!