Sri Venkateswara College: ఇంటర్/డిగ్రీ అర్హతతో శ్రీ వెంకటేశ్వర కాలేజీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన న్యూఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ (TTD).. నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల (Non Teaching Staff Posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల..
Sri Venkateswara College Recruitment 2022: తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన న్యూఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ (TTD).. నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల (Non Teaching Staff Posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్ధులు వడోదర, దహేజ్ శాఖల్లో పనిచేయవల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టులు: 50
పోస్టులు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, లైబ్రేరియన్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులు
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్/డిగ్రీ/బీఎల్‌ఐఎస్సీ/ఎంఎల్‌ఐఎస్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము: రూ.1000
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 21, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.