Sleeping: పడుకోగానే కమ్మని నిద్ర పట్టాలంటే ఇలా చేయండి..
అనిశ్చిత జీవన శైలి కారణంగా అనేక మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అందుకు గల ప్రధాన కారణాల్లో తినే ఆహారం కూడా ఒకటి. అవును.. మనం ఎమి తింటున్నాం, ఎలా తింటున్నాం.. అనే అంశాలు నిద్ర స్థాయిలను నిర్ణయిస్తాయని మీకు తెలుసా ?
Foods That Help You Sleep: అనిశ్చిత జీవన శైలి కారణంగా అనేక మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అందుకు గల ప్రధాన కారణాల్లో తినే ఆహారం కూడా ఒకటి. అవును.. మనం ఎమి తింటున్నాం, ఎలా తింటున్నాం.. అనే అంశాలు నిద్ర స్థాయిలను నిర్ణయిస్తాయి. ముఖ్యంగా రాత్రిళ్లు భోజనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రి భోజనలో ఏం తింటామో వాటిపైనే మన రాత్రి నిద్ర కూడా ఆధారపడి ఉంటుంది. చాలామంది ఎదోఒకటి తినేస్తే సరిపోతుందిలే అని సరిపెట్టుకుంంటారు. ఆ తర్వాత నిద్రపట్టక ఇబ్బందిపడుతుంటారు. రాత్రి సమయంలో ఎక్కువ భాగం నిద్రలోనే గడిపేస్తం. తేలిగ్గా జీర్ణ మయ్యే పదార్థాలు మాత్రమే తింటే.. జీర్ణక్రియకు భంగం కలగకుండా ఉదయాన్నే పొట్ట శుభ్రం అవుతుంది. తొంభైశాతం మంది సరైన ఆహారం ఎంచుకోకపోవడం వల్ల రాత్రిళ్లు నిద్రపోవడం లేదని అనేక అధ్యయనాలు తెలిపాయి. అలాంటప్పుడు ఏ విధమైన ఆహారం తీసుకోవాలనే అంశంపై క్లారిటీ ఉండాలి.
డిన్నర్ సాధ్యమైనంత చాలా తేలికగా, జీర్ణమయ్యేలా ఉండాలి. భోజనం తర్వాత కడుపు భారంగా అనిపించకూడదు. గ్యాస్ ఉత్పత్తి చేసే పదార్ధాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది నిద్రిస్తున్నప్పుడు కడుపు నొప్పికి కారణమవుతుంది. నిద్రలేమికి కూడా కారణం అవుతుంది. కారంగా కూడా ఉండకూడదు. ఇది డీహైడ్రేషన్ సమస్యకు దారి తీస్తుంది. దీంతో మాటిమాటికి లేచి నీళ్లు తాగవల్సి వస్తుంది. రాత్రి భోజనంలో తేలికపాటి సుగంధ ద్రవ్యాలు, ఆవుపాలతో తయారు చేసిన దేశీ నెయ్యిని ఉపయోగించాలి. పప్పు, చపాతీ అన్ని విధాలా బాగుంటుంది. అలాగే బ్రోకోలీ, కొబ్బరి, పుదీనా ఉపయోగించిన వంటకాలు సులభంగా జీర్ణమవుతాయి. వీటితోపాటు ఆకుకూరలు, పులుసు కూరలను కూడా తినవచ్చు.