AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC: గ్రూప్‌-1 పరీక్షకు టీఎస్‌పీఎస్సీ పకడ్బందీ ఏర్పాట్లు.. గతంలో ఎన్నడూ లేని విధంగా..

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను అక్టోబర్ 16న నిర్వహించనున్న విషయం తెలిసిందే. ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహణకు ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రెండు రోజుల్లో హాల్‌ టికెట్లను కూడా విడుదల చేయనున్నారు...

TSPSC: గ్రూప్‌-1 పరీక్షకు టీఎస్‌పీఎస్సీ పకడ్బందీ ఏర్పాట్లు.. గతంలో ఎన్నడూ లేని విధంగా..
Tspsc
Narender Vaitla
|

Updated on: Oct 08, 2022 | 8:42 AM

Share

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను అక్టోబర్ 16న నిర్వహించనున్న విషయం తెలిసిందే. ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహణకు ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రెండు రోజుల్లో హాల్‌ టికెట్లను కూడా విడుదల చేయనున్నారు. ఇక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న మొదటి గ్రూప్‌ -1 పరీక్షకు టీఎస్‌పీఎస్‌సీ సర్వం సిద్ధం చేసింది. రాత పరీక్ష ద్వారానే ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షలో ఎలాంటి తప్పులు దొర్లకుండా పకడ్బందీ ఏర్పాట్లను ఏర్పాటు చేస్తోంది. సీసీ కెమెరా నిఘాలో పరీక్షలను నిర్వహించనున్నారు. అభ్యర్థుల సంఖ్యను బట్టి ఒక్కో జిల్లాలో 30 నుంచి 100 వరకు ఎగ్జామ్​సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్​పరిధిలో 100 వరకు కేంద్రాలు ఉంటాయి.

ఇక ఎలాంటి తప్పులకు తావులేకుండా ప్రతీ 24 మంది అభ్యర్థులకు ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని పరీక్షా కేంద్రాల్లోని సీసీ కెమెరాల నుంచి పరిశీలించేందుకు జిల్లాలు హైదరాబాద్ లోని పోలీస్​కమాండ్ కంట్రోల్​రూమ్‌లతోపాటు టీఎస్​పీఎస్సీలో ఏర్పాటు చేసే కంట్రోల్​రూమ్‌కు కనెక్ట్ చేయనుంది. సెంటర్లలో బయో మెట్రిక్ విధానాన్ని అమలు చేయనుంది. ఐరిస్ స్కానర్, బార్​కోడ్, క్యూఆర్​కోడ్, ఫింగర్​ప్రింట్, ఫేస్​రికగ్నైజ్ తో కూడిన బయోమెట్రిక్​ మెషీన్లను వినియోగించాలని భావిస్తోంది. ఇందుకుగాను అవసరమయ్యే సామాగ్రిని కాంట్రాక్ట్‌ ఇచ్చేందుకు టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది.

ఇదిలా ఉంటే మొత్తం 503 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు మొత్తం 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మొత్తం పోస్టుల్లో మహిళలకు 225 రిజర్వ్‌ ఉన్నాయి. వీటికి 1,51,192 మంది దరఖాస్తు చేసుకున్నారు. దివ్యాంగుల కేటగిరీలో మొత్తం 24 పోస్టులు ఉండగా 6105 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక మొత్తం పోస్టుల్లో 51,553 మంది ప్రభుత్వ ఉద్యోగులు అప్లై చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్