IIT Recruitment: ఐఐటీ గౌహతిలో ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక.. రేపే ఇంటర్వ్యూ..

గౌహతి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ క్యాంపస్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ క్యాంపస్‌లో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

IIT Recruitment: ఐఐటీ గౌహతిలో ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక.. రేపే ఇంటర్వ్యూ..
Iit Guwahati Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 08, 2022 | 10:09 AM

గౌహతి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ క్యాంపస్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ క్యాంపస్‌లో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? ఎవరు అర్హులు లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 14 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ఎన్ ఆర్ఎఫ్, అసోసియేట్ ప్రాజెక్టు సైంటిస్ట్, అసోసియేట్ ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ వంటి పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా బ్యాచిలర్స్ డిగ్రీ /పీజీ/మాస్టర్స్ డిగ్రీ/పీహెచ్ డీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే యూజీసీ నెట్ /గేట్/నెట్ అర్హత సాధించాలి.

ముఖ్యమైన విషాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈమెయిల్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులు తమ వివరాలను nano_off@iitg.ernet.in మెయిల్‌ ఐడీకి పంపించాలి.

* అభ్యర్థులను నేరుగా ఆన్‌లైన్‌లో నిర్వహించే ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఇంటర్వ్యూను అక్టోబర్ 11, 2022 తేదీన నిర్వహించనున్నారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..