TSPSC Group 1 Answer Key: తెలంగాణ గ్రూప్ 1 తుది ఆన్సర్ ‘కీ’ విడుదల.. 8 ప్రశ్నలు తొలగించిన టీఎస్‌పీఎస్సీ
తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీ తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) విడుదల చేసింది. ప్రిలిమ్స్‌లో 8 ప్రశ్నలను తొలగించగా, మరో రెండు ప్రశ్నల సమాధానాలను కమిషన్ మార్చింది. మాస్టర్ ప్రశ్నపత్రం ప్రకారం 3, 4, 5, 46, 54, 114, 128, 135 ప్రశ్నలను తొలగించారు. 38వ ప్రశ్నకు ప్రాథమిక కీలో సమాధానం..

హైదరాబాద్, ఆగస్టు 2: తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీ తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) విడుదల చేసింది. ప్రిలిమ్స్‌లో 8 ప్రశ్నలను తొలగించగా, మరో రెండు ప్రశ్నల సమాధానాలను కమిషన్ మార్చింది. మాస్టర్ ప్రశ్నపత్రం ప్రకారం 3, 4, 5, 46, 54, 114, 128, 135 ప్రశ్నలను తొలగించారు. 38వ ప్రశ్నకు ప్రాథమిక కీలో సమాధానం 3 ఉండగా తుది కీలో సమాధానం 2గా మారింది. అదేవిధంగా 59వ ప్రశ్నకు ప్రాథమిక కీలో జవాబును 1 ఉండగా దానిని 3గా మార్చింది.
కాగా ఈ ఏడది జూన్ 11న నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,33,506 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించి ప్రాథమిక ఆన్సర్ కీని జూన్ 28న విడుదల చేసిన సంగతి తెలిసిందే. జులై 1 నుంచి 5 వరకు అభ్యంతరాలను స్వీకరించింది. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన నిపుణుల కమిటీ తుది కీని తాజాగా విడుదల చేసింది. ఫైనల్ కీలో ఎలాంటి మార్పులు, చేర్పులు ఉండవని.. దీనిని బట్టే తుది ఫలితాలు ఉంటాయని కమిషన్ స్పష్టం చేసింది. ప్రిలిమ్స్‌లో ఎనిమిది ప్రశ్నలను తొలగించగా మిగిలిన 142 ప్రశ్నలకు వచ్చిన మార్కులనే పరిగణనలోకి తీసుకుని 150 మార్కులకు దామాషా పద్ధతిలో లెక్కించి ప్రతి అభ్యర్థి మూడు డెసిమల్స్ వరకు మార్కులను కేటాయించనుంది.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫైనల్ ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి.




మరిన్ని కెరీర్ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.