TS TET Results 2025: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. నేరుగా ఇక్కడ రిజల్ట్స్ చెక్ చేసుకోండి..
TG TET Results 2025: టీజీ టెట్ 2025 ఫలితాల్లో 33.98శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం మీద 30,649 మంది అభ్యర్థులు క్వాలిఫై అయినట్లు విద్యాశాఖ వెల్లడించింది. టెట్ ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మంగళవారం ఆన్ లైన్ లో నేరుగా విడుదల చేశారు. పేపర్ 1 పరీక్షకు 47,224 మంది హాజరైతే.. 29,043 మంది పాస్ అయ్యారు

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలను విద్యాశాఖ వెల్లడించింది. జూన్ 18 నుంచి 30 వరకు మొత్త 16 సెషన్స్ లో నిర్వహించిన పరీక్షకు 90,205 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్ 1,2 లను ఏడు భాషల్లో ఎగ్జామ్ నిర్వహించారు. టీజీ టెట్ 2025 ఫలితాల్లో 33.98శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం మీద 30,649 మంది అభ్యర్థులు క్వాలిఫై అయినట్లు విద్యాశాఖ వెల్లడించింది. టెట్ ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మంగళవారం ఆన్ లైన్ లో నేరుగా విడుదల చేశారు. పేపర్ 1 పరీక్షకు 47,224 మంది హాజరైతే.. 29,043 మంది పాస్ అయ్యారు. పేపర్ 2 లో మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ లో 48,998 మంది పరీక్ష రాస్తే 17,574 మంది క్వాలిఫై అయ్యారు. పేపర్ 2 లోని సోషల్ స్టడీస్ లో 41,207 మంది ఎగ్జామ్ రాస్తే 13,075 మంది ఉత్తీర్ణులయ్యారు.
TET Results కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ముందుగా హాల్ టికెట్ నెంబర్ ను ఎంటర్ చేయండి..
ఆ తర్వాత పేపర్ ను ఎంచుకోండి..
పుట్టిన తేదీని ఎంటర్ చేయండి..
ఆ తర్వాత ఎంటర్ చేయగానే ఫలితాలు కనిపిస్తాయి.
భవిష్యత్తు అవసరాల కోసం రిజల్ట్స్ కార్డ్ ను డౌన్‌లోడ్ చేసుకోండి..
ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తామన్న ప్రభుత్వ హామీ మేరకు గతేడాది డిసెంబర్ లో టెట్ ఎగ్జామ్ నిర్వహించారు.. తిరిగి రెండో టెట్ ను జూన్ లోనే విద్యాశాఖ కండక్ట్ చేసింది. ఒక్కసారి టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు డీఎస్సీ రాసేందుకు ఎప్పటికీ అవకాశం ఉంటుంది. దీంతో అభ్యర్థులు కొత్తగా రాసే వారు ఎక్కువ మంది ఉంటున్నారు.
