AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Engineering Counselling: తెలంగాణ ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

TS Engineering Counselling: తెలంగాణలో ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఖరారైంది.  తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(టీఎస్‌ ఎంసెట్‌)..

TS Engineering Counselling: తెలంగాణ ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల
Telangana Engineering Counselling
Subhash Goud
|

Updated on: Aug 10, 2021 | 6:51 PM

Share

TS Engineering Counselling: తెలంగాణలో ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఖరారైంది.  తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(టీఎస్‌ ఎంసెట్‌) 2021 మొదటి దశ ప్రవేశాల కౌన్సిలెంగ్‌ ఆగస్టు 30వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి అధ్యక్షతన విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌, ప్రవేశాల కమిటీ సభ్యులు సమావేశమై షెడ్యూలు ఖరారు చేశారు.

ఈ నెల 30 నుంచి సెప్టెంబరు 9వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రుసుము చెల్లించి ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

సెప్టెంబరు 4 నుంచి 11 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ.

సెప్టెంబరు 4 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు.

సెప్టెంబరు 15న ఇంజినీరింగ్ మొదటి విడత సీట్లను కేటాయిస్తారు.

సెప్టెంబరు 15 నుంచి 20 వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్‌.

కాగా, రెండో విడత కౌన్సెలింగ్ తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని నవీన్ మిత్తల్ పేర్కొన్నారు.

ఇవీ కూడా చదవండి

Hiring Trends 2021: ఐటీ కంపెనీల నియామకాల్లో ప్రతిభ కోసం ఇకపై యుద్ధం భారీగా ఉంటుంది..ఐబీఎం 

BSF Constable Recruitment: పదో తరగతి పాసైతే చాలు కానిస్టేబుల్‌ ఉద్యోగం.. ఆగస్టు 9 నుంచి దరఖాస్తులు ప్రారంభం