BSF Constable Recruitment: పదో తరగతి పాసైతే చాలు కానిస్టేబుల్‌ ఉద్యోగం.. ఆగస్టు 9 నుంచి దరఖాస్తులు ప్రారంభం

BSF Constable Recruitment: ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. చాలా సంస్థల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఇక..

BSF Constable Recruitment: పదో తరగతి పాసైతే చాలు కానిస్టేబుల్‌ ఉద్యోగం.. ఆగస్టు 9 నుంచి దరఖాస్తులు ప్రారంభం
Follow us

|

Updated on: Aug 08, 2021 | 1:20 PM

BSF Constable Recruitment: ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. చాలా సంస్థల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఇక తాజాగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ సీలో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టులను భర్తీ చేస్తోంది. మొత్తం 269 ఖాళీలను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ కానున్నాయి. నియామక ప్రక్రియ పూర్తయ్యేనాటికి పోస్టుల సంఖ్య పెరిగవచ్చు.. లేదా తగ్గవచ్చు. యువతీయువకులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు 2021 ఆగస్ట్ 9న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తు చేయడానికి సెప్టెంబర్ 22 చివరి తేదీ. స్పోర్ట్స్ కోటాలో తాత్కాలికంగా భర్తీ చేస్తున్న పోస్టులు. పర్మనెంట్ చేసే అవకాశం కూడా ఉంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://rectt.bsf.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

ఖాళీల వివరాలు ఇవే

మొత్తం ఖాళీలు- 269

బాక్సింగ్ (మెన్)- 10, బాక్సింగ్ (వుమెన్)- 10, జూడో (మెన్)- 8, జూడో (వుమెన్)- 8 స్విమ్మింగ్ (మెన్)- 12, స్విమ్మింగ్ (వుమెన్)- 4, క్రాస్ కంట్రీ (మెన్)- 2, క్రాస్ కంట్రీ (వుమెన్)- 2, కబడ్డీ (మెన్)- 10, వాటర్ స్పోర్ట్స్ (మెన్)- 10, వాటర్ స్పోర్ట్స్ (వుమెన్)- 6, వుషూ (మెన్)- 11, జిమ్నాస్టిక్స్ (మెన్)- 8, హాకీ (మెన్)- 8, వెయిట్ లిఫ్టింగ్ (మెన్)- 8, వెయిట్ లిఫ్టింగ్ (వుమెన్)- 9, వాలీబాల్ (మెన్)- 10, రెజ్లింగ్ (మెన్)- 12, రెజ్లింగ్ (వుమెన్)- 10, హ్యాండ్ బాల్ (మెన్)- 8, బాడీ బిల్డింగ్ (మెన్)- 6, ఆర్చరీ (మెన్)- 8, ఆర్చరీ (వుమెన్)- 12, తైక్వాండో (మెన్)- 10, అథ్లెటిక్స్ (మెన్)- 20 అథ్లెటిక్స్ (వుమెన్)- 25, ఈక్వెస్ట్రియన్ (మెన్)- 2, షూటింగ్ (మెన్)- 3, షూటింగ్ (వుమెన్)- 3, బాస్కెట్ బాల్ (మెన్)- 6, ఫుట్‌బాల్ (మెన్)- 8.

దరఖాస్తు ప్రారంభం- 2021 ఆగస్ట్ 9

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 22

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు, యూనివర్సిటీ నుంచి 10వ తరగతి పాస్ కావాలి.

వయస్సు: 2021 ఆగస్ట్ 1 నాటికి 18 నుంచి 23 ఏళ్లు.

వేతనం: రూ.21,700 బేసిక్ వేతనంతో మొత్తం రూ.69,100 వేతనం లభిస్తుంది.

ఎత్తు: పురుషులు 170 సెంటీమీటర్లు, మహిళలు 157 సెంటీమీటర్లు

స్పోర్ట్స్ క్వాలిఫికేషన్‌: ఛాంపియన్‌షిప్, నేషనల్ గేమ్స్, అంతర్జాతీయ క్రీడోత్సవాల్లో పాల్గొన్నవారు, మెడల్స్ సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం: డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్.

ఇవీ కూడా చదవండి

Telangana: తెలంగాణలో క్యాడర్‌ పోస్టులు.. ఉద్యోగ నోటిఫికేషన్‌లకు లైన్‌ క్లియర్‌.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం..!

Niper Recruitment: గువహటి నైపర్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.

Latest Articles