Telangana: తెలంగాణలో క్యాడర్‌ పోస్టులు.. ఉద్యోగ నోటిఫికేషన్‌లకు లైన్‌ క్లియర్‌.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం..!

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర, జోనల్‌, జిల్లాస్థాయి పోస్టులను గుర్తిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది ప్రభుత్వం. అయితే ఏ పోస్టులు ఏ పరిధిలోకి వస్తాయనే..

Telangana: తెలంగాణలో క్యాడర్‌ పోస్టులు.. ఉద్యోగ నోటిఫికేషన్‌లకు లైన్‌ క్లియర్‌.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం..!
Follow us

|

Updated on: Aug 08, 2021 | 7:41 AM

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర, జోనల్‌, జిల్లాస్థాయి పోస్టులను గుర్తిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది ప్రభుత్వం. అయితే ఏ పోస్టులు ఏ పరిధిలోకి వస్తాయనే అంశాన్ని అందులో ప్రకటించింది. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారం క్యాడర్ పోస్టుల విభజన జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జోనల్‌ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేడర్లను ఖరారు చేసింది. వివిధ హోదాలను జిల్లా, జోనల్, మల్టీజోనల్‌ కేడర్ల కింద విభజించింది.

అయితే పెండింగ్‌లో ఉన్న ప్రాంతాలను కలిపేందుకు కేంద్ర సర్కార్‌ నుంచి అనుమతులు వచ్చాయి. దీంతో మిగిలి ఉన్న జోన్‌లకు పరిష్కారం కూడా లభించింది. అన్ని సమస్యలు పరిష్కారం కావడంతో 50 వేల ఉద్యోగుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఖాళీ ఉన్న వాటిని భర్తి చేసేందుకు క్యాడర్‌ పోస్టుల విభజన చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో జూనియర్ అసిస్టెంట్‌, టైపిస్ట్‌, ఆఫీస్‌ సబ్‌ఆర్డినేట్, డ్రైవర్‌ పోస్టులను జిల్లా క్యాడర్ పోస్టులుగా గుర్తిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. మిగిలిన వాటిని జోనల్, మల్టీజోనల్‌ పోస్టులుగా గుర్తించింది ప్రభుత్వం.

ఆఫీస్‌ సబార్డినేట్‌ నుంచి జూనియర్‌ అసిస్టెంట్‌ వరకు జిల్లా కేడర్‌ కింద గుర్తించగా, సీనియర్‌ అసిస్టెంట్, ఆపై పోస్టులు జోనల్‌ కేడర్‌ కింద, జిల్లాస్థాయి అధికారులు, ఇతర పోస్టులను మల్టీజోనల్‌ కేడర్‌ కింద పరిగణించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అయితే కొన్నిశాఖల్లో పక్కపక్క జిల్లాలను, పక్కపక్క జోన్లను కలిపి యూనిట్లుగా ఏర్పాటు చేసి పలురకాల పోస్టులను యూనిట్ల పరిధిలోకి తీసుకుని వచ్చింది ప్రభుత్వం. ఏ పోస్టు ఏ కేటగిరి కిందకు వస్తుందో.. క్యాడర్‌ విభజన జరిగింది. జీఓ 84లో అందుకు తగినట్లుగా ఉత్తర్వులను విడుదల చేసింది. కొన్ని లోకల్ క్యాడర్ పోస్ట్‌లు జోనల్ పోస్ట్‌లుగా మారాయి. అదేవిధంగా స్టేట్ క్యాడర్ పోస్ట్‌లు మల్టిజోనల్ పోస్ట్‌లుగా మారిపోయాయి. ఉత్తర్వుల ప్రకారం ఆయా శాఖల్లో క్యాడర్ సంఖ్య నిర్ణయం జరుగుతుంది. అయితే క్యాడర్ ఆధారంగా ప్రస్తుతమున్న ఉద్యోగులను ఆయా శాఖల్లో కేటాయింపు చేసి.. కొత్త పోస్ట్‌ల గుర్తింపు జరుగుతుంది. ఆ తర్వాత ఖాళీలపై స్పష్టత వస్తుంది. త్వరలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌లు వచ్చే అవకాశం ఉంది.

ఇవీ కూడా చదవండి

Niper Recruitment: గువహటి నైపర్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రైవేటు వర్సిటీల్లో 35 శాతం కన్వీనర్‌ కోటా..

Latest Articles
ఐటీఆర్‌ ఫైల్‌ చేసే ముందు గృహ రుణ ప్రయోజనాలు.. రూ.7 లక్షలు ఆదా
ఐటీఆర్‌ ఫైల్‌ చేసే ముందు గృహ రుణ ప్రయోజనాలు.. రూ.7 లక్షలు ఆదా
ఆస్తమా పేషెంట్స్ ఏది తినాలి..? ఏ ఆహారాలకు దూరంగా ఉండాలంటే
ఆస్తమా పేషెంట్స్ ఏది తినాలి..? ఏ ఆహారాలకు దూరంగా ఉండాలంటే
అమ్మబాబోయ్.. ఇదేం అరాచకం..
అమ్మబాబోయ్.. ఇదేం అరాచకం..
ఓటు వేసిన ప్రధాని నరేంద్ర మోడీ..రాఖీ కట్టిన వృద్ధురాలు..ఓటర్లతో..
ఓటు వేసిన ప్రధాని నరేంద్ర మోడీ..రాఖీ కట్టిన వృద్ధురాలు..ఓటర్లతో..
చెన్నైకి బ్యాడ్‌న్యూస్.. ఐపీఎల్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..
చెన్నైకి బ్యాడ్‌న్యూస్.. ఐపీఎల్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..
ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిందే..
ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిందే..
టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్
టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!