TS Dussehra Holidays 2023: స్కూల్ విద్యార్ధులకు అలర్ట్.. తెలంగాణ దసరా సెలవు తేదీలో మార్పు చేస్తూ సర్కార్ ఉత్తర్వులు
బతుకమ్మ, దసరా పండుగలకు కలిపి ఒకేసారి తెలంగాణ విద్యాశాఖ సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే దసరా సెలవుల తేదీల్లో మార్పులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దసరా సెలవు దినాన్ని అక్టోబర్ 23వ తేదీకి మారుస్తూ ప్రకటన వెలువరించింది. అంతేకాకుండా సెలవు దినాల్లో మరో రోజు పొడిగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో అక్టోబరు 24వ తేదీని కూడా సెలవుదినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ..
హైదరాబాద్, అక్టోబర్ 8: బతుకమ్మ, దసరా పండుగలకు కలిపి ఒకేసారి తెలంగాణ విద్యాశాఖ సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే దసరా సెలవుల తేదీల్లో మార్పులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దసరా సెలవు దినాన్ని అక్టోబర్ 23వ తేదీకి మారుస్తూ ప్రకటన వెలువరించింది. అంతేకాకుండా సెలవు దినాల్లో మరో రోజు పొడిగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో అక్టోబరు 24వ తేదీని కూడా సెలవుదినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఈ ఏడాదికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల జాబితాలో అక్టోబరు 24వ తేదీని ‘దసరా సెలవు’ దినంగా పేర్కొంటూ ఉత్తర్వుల్లో తెల్పింది. తాజాగా దసరా సెలవును ఒక రోజు ముందుకు తీసుకొచ్చిన సర్కార్ ఈ మేరకు తన ప్రకటనలో తెల్పింది.
టీఎస్సీయస్సీ గ్రూప్-4 ఫలితాలు నెలలోనే.. !
తెలంగాణ గ్రూప్-4 ఫలితాల 2023 కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న అభ్యర్ధులకు టీఎస్పీఎస్సీ నుంచి కీలక ప్రకటన వెలువడింది. టీఎస్పీఎస్సీ గ్రూప్-4 ఫలితాలను ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు కమిషన్ అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కాగా గ్రూప్-4 ఫైనల్ ఆన్సర్ ‘కీ’ అక్టోబరు 6వ తేదీన వెల్లడించిన నేపథ్యంలో కమిషన్ ఫలితాలను కూడా వెంటనే వెల్లడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ గ్రూప్-4 కింద 8,039 ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. నియామక పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాగా వీరిలో దాదాపు 80 శాతం మంది రాత పరీక్షకు హాజరయ్యారు.
అక్టోబర్ 9 నుంచి తెలంగాణ పీఈసెట్ రెండో విడత కౌన్సెలింగ్
బీపీఎడ్, డీపీఎడ్ సీట్ల భర్తీకి తెలంగాణ పీఈసెట్ 2023 రెండో విడత కౌన్సెలింగ్ అక్టోబర్ 9 (సోమవారం) నుంచి ప్రారంభంకానున్నట్లు ప్రవేశాల కన్వీనర్ ప్రొఫెసర్ పి రమేష్‌బాబు తెలిపారు. అక్టోబర్ 9 నుంచి 11వ తేదీ వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ జరుగుతాయి. ఆ తర్వాత అక్టోబర్ 12, 13 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకుంటే, అక్టోబర్ 17న సీట్ల కేటాయింపు ఉంటుంది.
ఏపీ ఇంటర్ మార్కుల జాబితాలు రెడీ..
ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన విద్యార్థుల ఒరిజనల్ మార్కుల జాబితాలు సిద్ధం అయినట్లు విజయవాడలోని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కార్యాలయంలో సిద్ధంగా ఉన్నట్లు ఆర్‌ఐవో రవికుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. జూనియర్ కాలేజీల ప్రిన్సిపల్‌లు మార్కుల జాబితాలను తీసుకొని, ఆయా విద్యార్థులకు అందజేయాలని ఆయన అన్నిజూనియర్ కాలేజీలను కోరారు. సకాలంలో విద్యార్ధులకు అందజేయని పక్షంలో తీవ్రమైన చర్యలు తీసుకుంటామని ఆర్‌ఐవో హెచ్చరికలు జారీ చేశారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.