TREIRB TGT Selection List 2024: తెలంగాణ గురుకుల ‘టీజీటీ’ తుది ఫలితాలు విడుదల.. ఇక్కడ నేరుగా రిజల్ట్స్ చెక్ చేసుకోండి
తెలంగాణ గురుకులాల్లో ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులకు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఎంతో మంది అభ్యర్ధుల నిరీక్షణకు తెరపడింది. తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో టీజీటీ ఉద్యోగ పరీక్షల ఫలితాలు బోర్డు విడుదల చేసింది. ఆదివారం (ఫిబ్రవరి 25) సాయంత్రం ఈ ఫలితాలను గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు అధికారిక వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచింది..
హైదరాబాద్, ఫిబ్రవరి 26: తెలంగాణ గురుకులాల్లో ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులకు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఎంతో మంది అభ్యర్ధుల నిరీక్షణకు తెరపడింది. తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో టీజీటీ ఉద్యోగ పరీక్షల ఫలితాలు బోర్డు విడుదల చేసింది. ఆదివారం (ఫిబ్రవరి 25) సాయంత్రం ఈ ఫలితాలను గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు అధికారిక వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచింది.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో మొత్తం 4,020 ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ( టీజీటీ) పోస్టులకు గతేడాది ఆగస్టులో రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల్లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు బోర్డు ఎంపిక చేసింది. ఈ మేరకు తొలుత ప్రొవిజినల్ సెలెక్షన్ జాబితాలను విడుదల చేసింది. ప్రొవిజినల్ జాబితాలో హాల్‌టికెట్ నంబర్ కలిగిన అభ్యర్థులందరికీ ఫిబ్రవరి 27, 28 తేదీల్లో హైదరాబాద్‌లో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరు కావాలని సూచించింది. సబ్జెక్టుల వారీగా ఎంపికైన వారి జాబితాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం 4,020 పోస్టులకు ఎంపికైన వారి వివరాలను వెల్లడించనుంది.
తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో జూనియర్, డిగ్రీ లెక్చరర్ పోస్టుల ఫలితాలు
సంక్షేమ గురుకులాల్లో 2,717 జూనియర్, డిగ్రీ లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షల తుది ఎంపిక ఫలితాలు నియామక బోర్డు సోమవారం వెల్లడించనుంది. ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారం ఆదివారం ఫలితాలు రావల్సి ఉండగా ఆ రోజు ప్రకటించలేదు. సోమవారం వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. జూనియర్ కళాశాలల్లో 1,924.. డిగ్రీ కాలేజీల్లో 793 అధ్యాపక పోస్టులకు గతేడాది ఆగస్టులో రాతపరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. అందులో మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను ఈ నెల రెండో వారంలో బోర్డు విడుదల చేయగా.. ఈ నెల 19, 20 తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేపట్టింది. ఆ తర్వాత వెంటనే డెమో తరగతులు కూడా నిర్వహించింది. డెమో తరగతులు, రాత పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా తుది ఫలితాలను వెల్లడించనుంది. దివ్యాంగుల కేటగిరీకి చెందిన ఫలితాలు మరో రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.