TOSS 10th, Inter 2025 Results: ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్) పదోతరగతి, ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు గురువారం (అక్టోబర్ 30) విడుదలయ్యాయి. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ అడ్మిషన్ నెంబర్ లేదా రోల్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలను చెక్..

హైదరాబాద్, అక్టోబర్ 30: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్) పదోతరగతి, ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు గురువారం (అక్టోబర్ 30) విడుదలయ్యాయి. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ అడ్మిషన్ నెంబర్ లేదా రోల్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. మార్కుల మెమోను కూడా ఇందులో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా ఈ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబరు నెలలో నిర్వహించిన సంగతి తెలిసిందే. టాస్ ఫలితాల కోసం ఈ కింద చెక్ చేసుకోండి.
టాస్ పదోతరగతి, ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
గేట్ 2026 కరెక్షన్ విండో వచ్చేసింది.. నవంబర్ 3 వరకు అవకాశం
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE 2026) గేట్ పరీక్షకు ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తు గడువు ముగిసింది. అయితే ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో ఏవైనా వివరాలు తప్పుగా నమోదు చేసిన వారికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గువాహటి (IIT Guwahati)మరో అవకాశం ఇచ్చింది. అప్లికేషన్‌లో మార్పులు చేయడానికి నవంబర్ 3, 2025వ తేదీ వరకు అవకాశం కల్పించింది. గేట్ (GATE) 2026కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు gate2026.iitg.ac.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఎన్‌రోల్‌మెంట్ నంబర్, పాస్‌వర్డ్ నమోదు చేసి అప్లికేషన్‌లో మార్పులు చేసుకోవచ్చు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లన్ విధానంలో గేట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష మూడు గంటల పాటు జరుగుతుంది. ఇతర వివరాలు ఈ కింది అధికారిక వెబ్‌సైట్ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
గేట్ 2025 ఆన్‌లైన్ అప్లికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




