TISS NET 2022 హాల్‌టికిట్లు విడుదల.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ (టిస్) నెట్ అడ్మిట్ కార్డులను ఫిబ్రవరి 17 (గురువారం)న విడుదల చేసింది..
TISS NET 2022 Hall tickets: టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ (టిస్) నెట్ అడ్మిట్ కార్డులను ఫిబ్రవరి 17 (గురువారం)న విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ tiss.edu నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకునే అభ్యర్థులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయడం ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా TISS NET 2022 ప్రవేశ పరీక్ష ఈ నెల (ఫిబ్రవరి) 26న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. ఇంగ్లీష్ మాద్యమంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల 40 నిముషాల వరకు నిర్వహించబడుతుంది. అంటే 1 గంట 40 నిమిషాలపాటు, ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్ష జరుగుతుంది.100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు (MCQ) సమాధానం రాయవల్సి ఉంటుంది.ఈ పరీక్షకు నెగెటివ్ మార్కింగ్ కూడా ఉండదు. టిస్ నెట్ పరీక్ష మొత్తం రెండు దశల్లో జరుగుతుంది. మొదటి పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్ష (ఫిబ్రవరి 26)న నిర్వహించబడుతుంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మే 24 నుంచి జూన్ 11 మధ్య జరిగే ఆన్‌లైన్ అసెస్‌మెంట్‌లకు హాజరుకావచ్చు. ఒకటి కంటే ఎక్కువ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కేవలం ఒక పరీక్షకు మాత్రమే హాజరు కావల్సి ఉంటుంది. ఐతే టిస్ నెట్ స్కోర్ కార్డు మిగతా అన్ని ప్రోగ్రాములకు చెల్లుబాటు అవుతుంది.
టిస్ నెట్ 2022 అడ్మిట్ కార్డులను ఈ కింది విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి..
- ముందుగా టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అధికారిక వెబ్‌సైట్ tiss.eduను ఓపెన్ చెయ్యాలి.
- హోమ్‌పేజ్‌లో కనిపించే ‘TISS NET 2022 Admit Card Download now’ అనే లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
- అవసరమైన లాగిన్ వివరాలను నమోదు చేసి సబ్‌మిట్ చెయ్యాలి.
- ఆ తర్వాత టిస్ నెట్ అడ్మిట్ కార్డ్ 2022 స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ఔట్ తీసుకోవాలి.
- అడ్మిట్ కార్డును పరీక్ష కేంద్రానికి తప్పనిసరిగా తీసుకెళ్లాలి. లేదంటే లోపలికి ప్రవేశముండదు.
Also Read: