NEET UG 2022 Exam date: నీట్ యూజీ 2022 పరీక్ష జూన్‌ చివర్లో లేదా జూలై మొదట్లో.. ఈ మార్పులు గమనించారా?

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG 2022) అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రవేశ పరీక్ష ఈ ఏడాది జూన్ లేదా జూలైలో జరగనుంది..

NEET UG 2022 Exam date: నీట్ యూజీ 2022 పరీక్ష జూన్‌ చివర్లో లేదా జూలై మొదట్లో.. ఈ మార్పులు గమనించారా?
Neet 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 18, 2022 | 7:38 AM

NEET 2022 UG Exam Date News: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG 2022) అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రవేశ పరీక్ష ఈ ఏడాది జూన్ లేదా జూలైలో జరగనుంది. ఎడ్యుకేషన్‌ అండ్‌ హెల్త్‌ మినిస్ట్రీ (Education and Health Ministry) తాజా సమాచారం ప్రకారం జూన్‌ మూడవ వారంలో లేదా జూలై మొదటి వారంలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా నీట్‌ యూజీ పరీక్షను దేశ వ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుష్, ఇతర అనుబంధ కోర్సుల్లో ప్రవేశాలకు ఏడాదికోసారి జరిగే ఏకైక ప్రవేశ పరీక్ష ఇది. కాగా గత ఏడాది.. కోవిడ్‌ (COVID-19) కారణంగా ఈ పరీక్షలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. వాయిదా అనంతరం సెప్టెంబర్‌లో నీట్‌ 2021 పరీక్ష జరిగింది. అంతేకాకుండా సిలబస్‌ను కూడా చాలా వరకు తగ్గించిన ఎన్టీఏ.. నీట్ 2021 పరీక్షను మల్టిపుల్ ఛాయిస్‌ క్వశ్చన్ల రూపంలో నిర్వహించింది. ఐతే ఈ ఏడాది నీట్‌ 2022 కూడా గత సంవత్సరం మాదిరిగానే మల్టిపుల్ ఛాయిస్‌ క్వశ్చన్ల రూపంలోనే ఉంటుందనే విషయంలో మాత్రం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు.

అలాగే నీట్‌ 2021 అప్లికేషన్‌ ప్రాసెస్‌ కూడా రెండు దశలుగా విభజించింది. పరీక్షకు ముందు మొదటి దశలో  కొంత సమాచారాన్ని సమర్పించాలి. ఫలితాలకు ముందు అంటే పరీక్ష తర్వాత రెండో దశలో మిగిలిన సమాచారాన్ని సబ్‌మిట్‌ చెయ్యాలి. గతంలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుష్, వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశాలకు మాత్రమే నీట్‌ పరీక్షను ఉపయోగించేవారు. ప్రస్తుతం బీఎస్సీ నర్సింగ్, లైఫ్ సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలు కూడా నీట్‌ పరీక్ష ద్వారానే చేపడుతున్నారు. ఇక నీట్‌, జేఈఈ రెండు పరీక్షలకు టై బ్రేకింగ్ విధానం నుంచి అభ్యర్థుల వయస్సు ప్రమాణాన్ని ఎన్టీఏ తొలగించింది. అంటే ఎక్కువ వయసున్న అభ్యర్థికి ర్యాంకు లిస్టులో ప్రాధాన్యత ఉండదన్నమాట.

జేఈఈ మెయిన్ 2022ను గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది నాలుగు సార్లు కాకుండా కేవలం రెండుసార్లు (ఏప్రిల్, మే నెలలు) నిర్వహించాలని ఇప్పటికే ఎన్టీఏ ప్రకటించిన విషయం తెలిసిందే.

Also Read:

TISS NET 2022 హాల్‌టికిట్లు విడుదల.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..