TGSRTC Admissions 2025: టీజీఎస్‌ఆర్‌టీసీ ఐటీఐ కాలేజీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు ఇలా!
రాష్ట్ర ఆర్టీసీ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కోర్సుల్లో చేరాలనుకొనే విద్యార్థులు టీజీఎస్‌ఆర్‌టీసీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. హైదరాబాద్ శివారులోని హకీంపేట్‌లో TGSRTC ఐటీఐ కాలేజీలో ప్రవేశాలు..

హైదరాబాద్, ఆగస్టు 9: తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కోర్సుల్లో చేరాలనుకొనే విద్యార్థులు టీజీఎస్‌ఆర్‌టీసీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. హైదరాబాద్ శివారులోని హకీంపేట్‌లో TGSRTC ఐటీఐ కాలేజీలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎనిమిది, పదో తరగతి విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కాలేజీలో మోటార్ వెహికల్ మెకానిక్, మెకానిక్ డీజిల్, వెల్డర్, పెయింటర్ ట్రేడ్‌లలో కోర్సులు అందిస్తున్నట్లు తన ప్రకటనలో పేర్కొంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆగస్టు 28వ తేదీలోగా అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించింది. ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకొనే విద్యార్థులు మరింత సమాచారం కోసం 9100664452, 6302649844, 040-69400000 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. ఈ మేరకు టీజీఎస్‌ఆర్టీసీ సూచనలు చేసింది.
మెకానిక్ డీజిల్, వెల్డర్ కోర్సులు ఏడాది వ్యవధిలో పూర్తయ్యే కోర్సులు. ఇక మెకానిక్ (మోటర్ వెహికల్), పెయింట్ కోర్సులు రెండేళ్ల వ్యవధితో అందిస్తున్నారు. వెల్డర్, పెయింటర్ కోర్సులకు ఎనిమిదో తరగతి విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సులకు ఏడాదికి రూ.16,500 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
త్వరలోనే ఎల్‌టీ, స్టాఫ్ నర్సు పరీక్షల ఫలితాలు విడుదల..
తెలంగాణ రాష్ట్రంలోని ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్సు పరీక్షల ఫలితాలు మరో రెండు రోజుల్లో విడుదల కానున్నాయి. తొలుత ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల చేయనున్నారు. అనంతరం 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేస్తారు. అలాగే స్టాఫ్ నర్సు పోస్టుల మెరిట్ జాబితా కూడా విడుదల చేసి, 2322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు వైద్య నియామక బోర్డు ఏర్పాట్లు చేస్తుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




