TGPSC Exam Results: ఉద్యోగ నియామకాల్లో వేగం పెంచిన టీజీపీఎస్సీ.. చకచకా పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు జారీకాగా.. వాటికి సంబంధించిన నియామక ప్రక్రియను టీజీపీఎస్సీ వేగవంతం చేసింది. గతంలో జారీచేసిన నోటిఫికేషన్ల రాత పరీక్షలను నిర్వహించడంతో పాటు ఫలితాలను కూడా వెల్లడిస్తోంది. కొత్త కమిషన్‌ ఏర్పాటైన 6 నెలల వ్యవధిలోనే దాదాపు 13 నోటిఫికేషన్లకు సంబంధించిన తుది ఫలితాలు వెల్లడించింది. 2022లో ప్రకటించిన నోటిఫికేషన్లకు ఇంకా పరీక్షలు..

TGPSC Exam Results: ఉద్యోగ నియామకాల్లో వేగం పెంచిన టీజీపీఎస్సీ.. చకచకా పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి
TGPSC Exams
Follow us

|

Updated on: Sep 02, 2024 | 3:40 PM

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 2: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు జారీకాగా.. వాటికి సంబంధించిన నియామక ప్రక్రియను టీజీపీఎస్సీ వేగవంతం చేసింది. గతంలో జారీచేసిన నోటిఫికేషన్ల రాత పరీక్షలను నిర్వహించడంతో పాటు ఫలితాలను కూడా వెల్లడిస్తోంది. కొత్త కమిషన్‌ ఏర్పాటైన 6 నెలల వ్యవధిలోనే దాదాపు 13 నోటిఫికేషన్లకు సంబంధించిన తుది ఫలితాలు వెల్లడించింది. 2022లో ప్రకటించిన నోటిఫికేషన్లకు ఇంకా పరీక్షలు నిర్వహించలేదని గుర్తించి, వాటిల్లో కొన్నటింటికి ఇటీవల కొన్ని రాతపరీక్షలు పూర్తిచేసింది. మిగతావాటికి రాతపరీక్షల షెడ్యూలు ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబరులోగా గ్రూప్‌-1, 2, 3 మినహా మిగతా ఉద్యోగ నోటిఫికేషన్ల ఫలితాలు ప్రకటించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో కోర్టు కేసుల్లో ఇరుక్కుపోయిన పోస్టులను పరిష్కరించి ఆయా పోస్టులకు మోక్షం ప్రసాధిస్తుంది.

2017లో జారీ అయిన మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ (ఎంఎల్‌టీ)ల పోస్టుల ఇన్‌సర్వీసు అభ్యర్థులకు వెయిటేజీ మార్కుల విషయంలో న్యాయవివాదాలు తలెత్తగా.. దాదాపు ఏడేళ్ల తరువాత పరిష్కరించి తాజాగా ఫలితాలు వెలువరించారు. గురుకులాల్లో పీఈటీ పోస్టులకు 2017లో జారీఅయిన నోటిఫికేషన్‌పై విద్యార్హతల విషయంలో వివాదాలు తలెత్తగా హైకోర్టు అర్హతలపై తీర్పు వెలువరించింది. డిప్లొమా చదివిన అభ్యర్థులు 5వ తరగతికి, డిప్లొమా, డిగ్రీ అభ్యర్థులు 6 నుంచి 8 తరగతుల వరకు, డిగ్రీ అభ్యర్థులు 9, 10 తరగతులకు బోధించాలని తీర్పులో వెల్లడించింది. 9, 10 తరగతులకు పీడీ స్కూల్స్‌ పోస్టులు ఉన్నాయి. అయితే 5వ తరగతి కోసం ప్రత్యేకమైన గురుకులాలు లేవు. దీంతో పీఈటీలు 6-8 తరగతి వరకు బోధించాలని, ఈ పోస్టులకు డిప్లొమా, డిగ్రీ అభ్యర్థులు అర్హులని నిర్ణయించింది. సమస్య పరిష్కారం కావడంతో 594 పోస్టులకు తుది ఫలితాలు వచ్చాయి.

అలాగే 8,180 గ్రూప్‌-4 సర్వీసు ఉద్యోగాలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాల కూడా పూర్తి చేశారు. జూన్‌ 20 నుంచి ఆగస్టు 21 వరకు రెండు నెలల పాటు పరిశీలన కొనసాగింది. మిగిలిపోయిన వారికి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కేంద్రాల్లో శనివారంతో ఈ ప్రక్రియ పూర్తి చేశారు. పరిశీలన పూర్తయిన అభ్యర్థులు ఆప్షన్ల నమోదు తర్వాత త్వరలోనే తుది నియామకాలు చేపట్టాలని టీజీపీఎస్సీ భావిస్తోంది. ఇక గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు అక్టోబరులో జరగనున్నాయి. గ్రూప్‌-2, 3 పోస్టుల రాత పరీక్షల తేదీలు కూడా వచ్చాయి. అక్టోబర్‌ 21 నుంచి గ్రూప్‌-1 మెయిన్స్, ఆగస్టు 7, 8న గ్రూప్‌-2, నవంబర్‌ 17, 18న గ్రూప్‌-3 పరీక్షలు జరుగుతాయి. టీజీపీఎస్సీ పరిధిలో అసిస్టెంట్‌ ఇంజినీరింగ్, భూగర్భజలశాఖలో నాన్‌ గెజిటెడ్‌ అధికారులు, వసతి గృహ సంక్షేమ అధికారులు, డీఏవో పోస్టులకు సంబంధించి తుది ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే వీటిని కూడా పూర్తి చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.