TGPSC DAO Merit List: టీజీపీఎస్సీ డీఏవో పోస్టులకు 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా విడుదల
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డైరెక్టరేట్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ విభాగంలో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) గ్రేడ్-2 పోస్టుల భరీకి సంబంధించి ఇటీవల నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. ఈ జాబితాలో చోటు సంపాదించిన అభ్యరులంరికీ..
హైదరాబాద్, అక్టోబర్ 14: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డైరెక్టరేట్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ విభాగంలో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) గ్రేడ్-2 పోస్టుల భరీకి సంబంధించి ఇటీవల నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. ఈ జాబితాలో చోటు సంపాదించిన అభ్యరులంరికీ నవంబరు 8 నుంచి 12 వరకు నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్ ఓ ప్రకటనలో తెలిపారు. దివ్యాంగుల పోస్టులకు 1:5 నిష్పత్తిలో అభ్యరులను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను టీజీపీఎస్సీ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
టీజీపీఎస్సీ డీఏవో మెరిట్ లిస్ట్ కోసం క్లిక్ చేయండి.
ఇవాళ్టి నుంచి బీడీఎస్ రెండో విడత వెబ్‌ఆప్షన్లు
తెలంగాణ రాష్ట్రంలో దంత వైద్య కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటాలో బీడీఎస్ సీట్ల భర్తీలో భాగంగా రెండో విడత కౌన్సెలింగ్‌కు సోమవారం (అక్టోబర్ 14) నుంచి వెబ్‌ఆప్షన్లను నమోదు చేసుకోవాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. వెబ్‌ఆప్షన్లు ఇచ్చిన వారికి సీట్ల కేటాయింపు చేపడతారు. మేనేజ్‌మెంట్ కోటాలో 11 వైద్య కాలేజీల్లో లోకల్ కేటగిరిలో 109 బీడీఎస్ సీట్లు ఉండగా.. అన్‌రిజర్వ్‌డ్ కేటగిరిలో 32 వరకు బీడీఎస్ సీట్లు ఉన్నాయని వివరించింది.
తెలంగాణ అరబిక్, ఫ్రెంచ్ జూనియర్ లెక్చరర్ ఫలితాలు వచ్చేశాయ్
తెలంగాణ ఇంటర్మీడియెట్ కాలేజీల్లో అరబిక్, ఫ్రెంచ్ బోధించే జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి ఎంపికైన అభ్యరుల జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) విడుదల చేసింది. పూర్తి వివరాలు కమిషన్ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
పీజీఈసెట్ చివరి విడత సీట్ల కేటాయింపు పూర్తి
ఎంటెక్, ఎంఫార్మసీ తదితర సీట్ల భర్తీకి పీజీఈసెట్ చివరి విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. మొత్తం 5,153 సీట్లకుగాను 4,221 సీట్లు భర్తీ అయ్యాయని ప్రవేశాల కన్వీనర్ పి.రమేశ్‌బాబు తెలిపారు. సీట్లు పొందిన వారు అక్టోబర్ 14 నుంచి 17లోపు ఫీజు చెల్లించి, ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు.