TGPSC Selection List: టీజీపీఎస్సీ ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల సెలక్షన్‌ లిస్ట్‌ విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ వైద్య విభాగాల్లో ఖాళీగా ఉన్న 200 ల్యాబ్‌ టెక్నీషియన్‌-II పోస్టులకు సంబంధించి ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) తాజాగా వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వివరాలను కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్ధులు వెబ్‌సైట్‌ నుంచి సెలక్షన్‌ లిస్ట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, తమ వివరాలను తనిఖీ చేసుకోవాలని..

TGPSC Selection List: టీజీపీఎస్సీ ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల సెలక్షన్‌ లిస్ట్‌ విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే
TGPSC Selection List
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 10, 2024 | 7:21 AM

హైదరాబాద్‌, జులై 10: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ వైద్య విభాగాల్లో ఖాళీగా ఉన్న 200 ల్యాబ్‌ టెక్నీషియన్‌-II పోస్టులకు సంబంధించి ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) తాజాగా వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వివరాలను కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్ధులు వెబ్‌సైట్‌ నుంచి సెలక్షన్‌ లిస్ట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, తమ వివరాలను తనిఖీ చేసుకోవాలని సూచించింది. అయితే ప్రాథమిక జాబితా ప్రకారం ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఎవరైనా స్వచ్ఛందంగా వదిలిపెట్టాలని భావిస్తే జులై 11 నుంచి 14 వరకు ఆన్‌లైన్లో ‘రీలింక్విష్‌మెంట్‌’ ఆప్షన్‌ ఇవ్వాలని ఈ సందర్భంగా అభ్యర్ధులను కోరింది. ఈ మేరకు తెలియజేస్తూ కమిషన్‌ వెబ్‌సైట్లో వెబ్‌లింక్‌ను అందుబాటులో పెట్టినట్లు పేర్కొంది.

టీజీపీఎస్సీ ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల ఎంపిక జాబితా కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

జులై 22 నుంచి తెలంగాణ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు శిక్షణ

తెలంగాణలో ఇటీవల కానిస్టేబుల్‌ నియామకాలకు సంబంధించిన నియామక ప్రక్రియను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో శిక్షణ కూడా ప్రారంభించింది. అయితే పలు కారణాలతో శిక్షణకు హాజరుకాని కానిస్టేబుల్‌ అభ్యర్థులకు మరో అవకాశం ఇస్తూ ప్రకటన వెలువరించింది. జులై 22 నుంచి మరోమారు శిక్షణకు అవకాశం కల్పిస్తున్నట్లు అడిషనల్‌ డీజీ అభిలాష్‌ బిస్త్‌ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా సివిల్, ఏఆర్, రాష్ట్ర ప్రత్యేక పోలీసు పటాలం (టీజీఎస్పీ) విభాగాలలో ఉద్యోగాలకు సంబంధించి పలువురు కానిస్టేబుల్‌ అభ్యర్థులు సాంకేతిక కారణాల వల్ల ఈ శిక్షణకు హాజరుకాలేదు. వీరికి జులై 22 నుంచి 9 నెలలు పాటు శిక్షణ ఇవ్వనున్నారు. వీరందరికీ శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అడిషనల్‌ డీజీ అభిలాష్‌ బిస్త్‌ అధికారులను కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.