TGPSC Group 3 Selection List: టీజీపీఎస్సీ గ్రూప్ 3 పోస్టుల ప్రొవిజినల్ ఎంపిక జాబితా విడుదల.. నేటి నుంచే వెబ్ ఆప్షన్లు
TGPSC Group 3 Provisional Selection List: గ్రూప్ 3 సర్వీస్ పోస్టుల ప్రొవిజినల్ సెలక్షన్ జాబితాను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) తాజాగా విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ప్రక్రియ మంగళవారం (సెప్టెంబర్ 30) నుంచి ప్రారంభమైంది. మొత్తం 1388 పోస్టులకు గానూ

హైదరాబాద్, సెప్టెంబర్ 30: తెలంగాణ గ్రూప్ 3 సర్వీస్ పోస్టుల ప్రొవిజినల్ సెలక్షన్ జాబితాను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) తాజాగా విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ప్రక్రియ మంగళవారం (సెప్టెంబర్ 30) నుంచి ప్రారంభమైంది. మొత్తం 1388 పోస్టులకు గానూ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్‌ను విడుదల చేసింది. ఈ జాబితాలో మెరిట్ ఆధారంగా 4,421 మంది అభ్యర్థులను జనరల్ కేటగిరీలో, అదనంగా 81 మందిని స్పోర్ట్స్ కోటా కింద ఎంపిక చేసింది.
టీజీపీఎస్సీ గ్రూప్ 3 పోస్టుల ప్రొవిజినల్ ఎంపిక జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీరంతా అక్టోబరు 10 సాయంత్రం 5.30 గంటల వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి అవకాశం కల్పిస్తారు. టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ లో అభ్యర్థులు తమ ప్రాధాన్యతలను నేటి నుంచి నమోదు చేసుకోవల్సి ఉంటుంది. ఈ వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమై అక్టోబర్ 10వ తేదీ సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగనుంది. ఎంపికైన అభ్యర్థులు గడువులోగా తమ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని ఈ మేరకు TGPSC స్పష్టం చేసింది.
కాగా టీజీపీఎస్సీ గ్రూప్ 3 పోస్టుల భర్తీకి సంబంధించి 2024 నవంబర్ 17, 18 తేదీల్లో రాత పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.67 లక్షల మంది ఈ పరీక్షలు రాశారు. దాదాపు ఏడాది తర్వాత వీటి ఫలితాలు కమిషన్ వెల్లడించింది. పరీక్షల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌తో మార్చి 14న విడుదలైంది. 2024 నవంబరు 17, 18ల్లో రాత పరీక్షలు జరిగాయి. దాదాపు 2.67 లక్షల మంది హాజరయ్యారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




