TGPSC Group 2 Edit Option: టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 అభ్యర్ధులు కీలక అప్‌డేట్.. ఇదే చివరి అవకాశం!

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్- II సర్వీసుల రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముఖ్యమైన అప్‌డేట్ జారీ చేసింది. అప్లికేషన్‌ ఫాంలో ఏవైనా తప్పులు దొర్లితే వాటిని సరిచేసుకునే సుదపాయం కల్పించింది. ఎడిట్ ఆప్షన్‌ ను ఆదివారం ఉదయం 10 గంటల నుంచి జూన్ 20వ తేదీ సాయంత్రం 5 గంల వరకు కమిసన్‌ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచుతున్నారు..

TGPSC Group 2 Edit Option: టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 అభ్యర్ధులు కీలక అప్‌డేట్.. ఇదే చివరి అవకాశం!
TGPSC Group 2 Edit Option
Follow us

|

Updated on: Jun 16, 2024 | 7:44 AM

హైదరాబాద్‌, జూన్‌ 16: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్- II సర్వీసుల రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముఖ్యమైన అప్‌డేట్ జారీ చేసింది. అప్లికేషన్‌ ఫాంలో ఏవైనా తప్పులు దొర్లితే వాటిని సరిచేసుకునే సుదపాయం కల్పించింది. ఎడిట్ ఆప్షన్‌ ను ఆదివారం ఉదయం 10 గంటల నుంచి జూన్ 20వ తేదీ సాయంత్రం 5 గంల వరకు కమిసన్‌ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచుతున్నారు. ఈ అవకాశాన్ని అభ్యర్ధులు సద్వినియోగం చేసుకోవాలని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ సూచించారు.

అభ్యర్థులు తమ వివరాలను ఎంటర్‌ చేసి ఆన్‌లైన్ అప్లికేషన్‌ ఓపెన్‌ చేసుకోవచ్చు. తాము చేసిన ప్రతి ఎంట్రీని సరిచూసుకోవాలని, అవసరమైన చోట దిద్దుబాట్లు చేయాలని ఆయన తెలిపారు. ఇప్పుడు ఇచ్చిన ఎడిట్ ఆప్షన్ ద్వారా మాత్రమే అభ్యర్ధులు తమ వివరాలను సరిచేసుకోవాలని, ఆ తర్వాత అప్లికేషన్‌ను సవరించడానికి వచ్చే అభ్యర్థనలను స్వీకరించబోమని TGPSC తెలిపింది. అప్లికేషన్‌ను సవరించిన తర్వాత అభ్యర్థులు తమ అప్లికేషన్ PDFని డౌన్‌లోడ్ చేసుకోవాలని వివరించింది.

రేపటితో ముగుస్తున్న తెలంగాణ సీపీగెట్‌ దరఖాస్తుకు తుది గడువు.. జులై 5 నుంచి పరీక్షలు

తెలంగాణ రాష్ట్రంగా ఉన్న యూనివర్సిటీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఎంఏ, ఎంకాం, ఎంఎస్‌సీతోపాటు ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ తదితర కోర్సుల్లో చేరేందుకు నిర్వహిస్తున్న సీపీగెట్‌కు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు రేపే చివరి తేదీ. జూన్‌ 17 (సోమవారం)తో ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు ముగియనుందని కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పాండురంగారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సీపీగెట్‌కు ఇప్పటివరకు 52 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు ఆలస్య రుసుం లేకుండానే రేపు గడువు సమయం ముగిసేలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. కాగా తెలంగాణ సీపీగెట్‌ 2024 పరీక్ష జులై 5న జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
అందాల పోటీల్లో ముందున్న ‘జారా’.. జారాది కళ్లు.. చెదిరే అందం.!
అందాల పోటీల్లో ముందున్న ‘జారా’.. జారాది కళ్లు.. చెదిరే అందం.!
పేరుకు కేంద్ర మంత్రి.. ఒక్క పదం రాయడం రాదట! ఓ లెవెల్‌లో ట్రోలింగ్
పేరుకు కేంద్ర మంత్రి.. ఒక్క పదం రాయడం రాదట! ఓ లెవెల్‌లో ట్రోలింగ్
ఎర్ర సముద్రంలో అరాచకం.. హౌతీ రెబెల్స్‌ మరో నౌకను ముంచేసారు.
ఎర్ర సముద్రంలో అరాచకం.. హౌతీ రెబెల్స్‌ మరో నౌకను ముంచేసారు.
రూ.10 వేలు పెట్టుబడి పెట్టి..రూ.10 కోట్లకు అధిపతులయ్యారు.!
రూ.10 వేలు పెట్టుబడి పెట్టి..రూ.10 కోట్లకు అధిపతులయ్యారు.!
షాకింగ్ ఘటన.. ఆలూ చిప్స్‌ ప్యాకెట్‌లో కుళ్లిన కప్ప.. వీడియో.
షాకింగ్ ఘటన.. ఆలూ చిప్స్‌ ప్యాకెట్‌లో కుళ్లిన కప్ప.. వీడియో.
స్నానానికి వెళ్లి బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా వల్ల మృతి.
స్నానానికి వెళ్లి బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా వల్ల మృతి.
దేశం దాటేందుకు వేషం మార్చ యువకుడి విఫలయత్నం.. చివరికి.?
దేశం దాటేందుకు వేషం మార్చ యువకుడి విఫలయత్నం.. చివరికి.?
చేయి తెగి రక్తమోడుతున్నా పట్టించుకోలేదు.. చివరికి ఏమైందంటే.!
చేయి తెగి రక్తమోడుతున్నా పట్టించుకోలేదు.. చివరికి ఏమైందంటే.!
టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే విమానంలో మంటలు..! వీడియో వైరల్..
టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే విమానంలో మంటలు..! వీడియో వైరల్..
చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక డెడ్ బాడీ..! వీడియో చూస్తే షాకే..
చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక డెడ్ బాడీ..! వీడియో చూస్తే షాకే..