TG ICET 2024 Top Rankers List: తెలంగాణ ఐసెట్‌ టాప్‌ ర్యాంకర్లు వీరే.. ఈసారి భారీగా పెరిగిన ఉత్తీర్ణత శాతం

రాష్ట్రంలోని ప్రముఖ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఐసెట్‌ పరీక్ష ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. జూన్‌ 5, 6 తేదీల్లో నిర్వహించిన ఐసెట్‌ పరీక్ష ఫలితాల్లో ఏకంగా 91.92% మంది ఉత్తీర్ణత సాధించారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఉత్తీర్ణత శాతం భారీగా పెరిగింది. తెలంగాణ ఐసెట్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 86,156 మంది దరఖాస్తు చేసుకోగా..

TG ICET 2024 Top Rankers List: తెలంగాణ ఐసెట్‌ టాప్‌ ర్యాంకర్లు వీరే.. ఈసారి భారీగా పెరిగిన ఉత్తీర్ణత శాతం
TG ICET 2024 Top Rankers
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 16, 2024 | 9:55 AM

హైదరాబాద్‌, జూన్‌ 16: రాష్ట్రంలోని ప్రముఖ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఐసెట్‌ పరీక్ష ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. జూన్‌ 5, 6 తేదీల్లో నిర్వహించిన ఐసెట్‌ పరీక్ష ఫలితాల్లో ఏకంగా 91.92% మంది ఉత్తీర్ణత సాధించారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఉత్తీర్ణత శాతం భారీగా పెరిగింది. తెలంగాణ ఐసెట్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 86,156 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 77,942 మంది పరీక్ష రాశారు. వారిలో 71,647 మంది ఉత్తీర్ణులయ్యారు. తొలి 10 ర్యాంకర్లలో అబ్బాయిలు, అమ్మాయిలు సమానంగా ఉన్నారు. 5, 7 ర్యాంకులను ఏపీ విద్యార్థులు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ లింబాద్రి మాట్లాడుతూ… గతేడాది 272 ఎంబీఏ కాలేజీల్లో 35,949 సీట్లు, 64 ఎంసీఏ కాలేజీల్లో 6,990 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ సారి మొత్తం 42,939 సీట్లు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఇవికాక మరికొన్ని పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. కౌన్సెలింగ్‌ తేదీలను త్వరలో వెల్లడిస్తామని ఆయన తెలిపారు.

తెలంగాణ ఐసెట్ టాప్‌-10 ర్యాంకర్లు వీరే..

  • ఎస్‌.ఎం.హుస్సేని (హైదరాబాద్‌) 153.53500 మార్కులతో ఫస్ట్‌ ర్యాంకు సాధించాడు.
  • జె.భరత్‌ (మాడుగుల) 152.79795 మార్కులతో సెకండ్‌ ర్యాంకు
  • కె.లాస్య (మల్కాజ్‌గిరి) 150.72933 మార్కులతో మూడో ర్యాంకు
  • పి.రిషికారెడ్డి (నిజామాబాద్‌) 148.34989 మార్కులతో నాలుగో ర్యాంకు
  • కె.శివకుమార్‌ (విజయవాడ) 143.70346 మార్కులతో 5వ ర్యాంకు
  • బి.అక్షిత్‌ (హైదరాబాద్‌) 142.59153 మార్కులతో 6వ ర్యాంకు
  • బి.రాణి (విజయనగరం) 142.29385 మార్కులతో 7వ ర్యాంకు
  • గంగా షిండే (హైదరాబాద్‌) 142.14644 మార్కులతో 8వ ర్యాంకు
  • ఎన్‌.అరుణ్‌సింగ్‌ (శంకర్‌పల్లి) 141.83559 మార్కులతో 9వ ర్యాంకు
  • బి.రవళి (ఖమ్మం) 140.94638 మార్కులతో 10 వ ర్యాంకు

టీజీ ఐసెట్‌ 2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

టీజీ ఐసెట్‌ 2024 ర్యాంక్‌ కార్డు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే