UPSC Prelims 2024: ఎన్నడూలేనిది.. ఈసారి సులువుగా యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్! కటాఫ్ ఎంత ఉంటుందంటే
యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ 2024 పరీక్ష ఆదివారం (జూన్ 16) ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా మొత్తం 80 నగరాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. మొత్తం 2 పేపర్లకు పరీక్ష జరగగా.. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పేపర్-1(జనరల్ స్టడీస్), మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు పేపర్-2 (సీశాట్) పరీక్ష జరిగింది. అయితే ఆదివారం జరిగిన ప్రిలిమ్స్ పరీక్షలో ప్రశ్నలు గతంతో పోల్చితే తేలికగా..
న్యూఢిల్లీ, జూన్ 17: యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ 2024 పరీక్ష ఆదివారం (జూన్ 16) ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా మొత్తం 80 నగరాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. మొత్తం 2 పేపర్లకు పరీక్ష జరగగా.. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పేపర్-1(జనరల్ స్టడీస్), మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు పేపర్-2 (సీశాట్) పరీక్ష జరిగింది. అయితే ఆదివారం జరిగిన ప్రిలిమ్స్ పరీక్షలో ప్రశ్నలు గతంతో పోల్చితే తేలికగా ఉన్నాయని అభ్యర్ధులు చెబుతున్నారు. గత ఐదేళ్లతో పోలిస్తే జనరల్ స్టడీస్‌లో ప్రశ్నలు మధ్యస్థాయి నుంచి తేలికగా వచ్చినట్లు నిపుణులు అంటున్నారు. ప్రశ్నలు ఎక్కువగా కాన్సెప్ట్ ఆధారితంగా ఇచ్చారు. సుధీర్ఘమైన ప్రశ్నలు తక్కువగా.. డైరెక్ట్ ఆన్సర్ చేసే ప్రశ్నలు కూడా కాస్త ఎక్కువగానే అడిగారు. పాలిటీలో అయితే.. ఇంటర్నేషనల్ ఇష్యూస్‌తో పాటు ఎకానమీ ప్రశ్నలు మధ్యస్థంగా వచ్చాయి. 15 ప్రశ్నలు ఇవ్వగా.. వాటిల్లో 3 కఠినంగా, 2 మీడియంగా, 10 తేలికగా ఇచ్చారు. చాలా వరకు లక్ష్మీకాంత్ బుక్ నుంచి వచ్చాయి. మొత్తం 15 ప్రశ్నల్లో 13 నేరుగా గుర్తించేలా ఉన్నాయి.
జాగ్రఫీ, ఎన్విరాన్‌మెంటల్, సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ ఆధారంగా అడిగారు. జాగ్రఫీలో 14 ప్రశ్నలు వస్తే వాటిల్లో 11 పుస్తకాల నుంచి నేరుగా వచ్చాయి. సబ్జెక్ట్‌పై అవగాహన ఉంటే తేలికగా సమాధానాలు గుర్తించేలా ప్రశ్నలు అడిగారు. ఇక త్రీ స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నలు కూడా వచ్చాయి. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను నుంచి పాలిటీ, జాగ్రఫీ సబ్జెక్టుల ప్రశ్నలు చాలా వరకు నేరుగా అడిగారు. మధ్యాహ్నం జరిగిన సీశాట్‌లో సులభం నుంచి మధ్యస్థాయి ప్రశ్నలు వచ్చాయి. నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు సైతం సమాధానాలు సులువుగా గుర్తించేవిగా ఉన్నట్లు పలువురు అభ్యర్ధులు తెలిపారు. ఈ లెక్కన చూస్తే జనరల్ కేటగిరీలో 90 కటాఫ్ మార్కులు ఉండే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే ప్రిలిమినరీ ఆన్సర్ కీ కమిషన్ విడుదల చేయనుంది.
పేపర్ 1లో ఏ సబ్జెక్టు నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చాయంటే..
- జాగ్రఫీలో 16 నుంచి 18 వచ్చాయి
- ఎన్విరాన్‌మెంట్‌లో 12 నుంచి 14 వచ్చాయి
- సైన్స్ అండ్ టెక్నాలజీలో 10 నుంచి 12 వచ్చాయి
- హిస్టరీలో 14 నుంచి 16 వచ్చాయి
- ఎకనామిక్స్‌లో 15 నుంచి 20 వచ్చాయి
- పాలిటీలో 14 నుంచి 16 వచ్చాయి
- కరెంట్ అఫైర్స్ లో 6 నుంచి 8 వచ్చాయి
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.