NEET UG 2024 Paper Leak: నీట్ యూజీ 2024 క్వశ్చన్ పేపర్ లీక్‌లో ట్విస్ట్…. ఒక్కొక్కరికి రూ.30 లక్షలకు అమ్మేశారు!
దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్- యూజీ ప్రవేశ పరీక్ష 2024లో అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. నీట్ పేపర్ లీక్‌పై వస్తోన్న ఆరోపణలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. బిహార్‌లో నీట్ యూజీ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు అక్కడి ఆర్ధిక నేరాల విభాగం (EOU) వెల్లడించింది. వీరి దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నీట్ పేపర్ లీక్ చేసినందుకు..
న్యూఢిల్లీ, జూన్ 16: దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్- యూజీ ప్రవేశ పరీక్ష 2024లో అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. నీట్ పేపర్ లీక్‌పై వస్తోన్న ఆరోపణలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. బిహార్‌లో నీట్ యూజీ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు అక్కడి ఆర్ధిక నేరాల విభాగం (EOU) వెల్లడించింది. వీరి దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నీట్ పేపర్ లీక్ చేసినందుకు కొందరు అభ్యర్థులు రూ.30 లక్షల చొప్పున ముడుపులు చెల్లించినట్లు బయటపడింది. ఈ విషయాన్ని పలు మీడియా సంస్థలు వెల్లడించాయి కూడా. అయితే దీనిని కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తోసిపుచ్చింది.
ఇప్పటివరకు 14 మంది అరెస్టు..
కాగా నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలపై దర్యాప్తునకు బిహార్ సర్కార్ సిట్‌ను ఏర్పాటుచేసింది. విచారణలో ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేశారు. వీరిలో బిహార్ ప్రభుత్వలో విధులు నిర్వహిస్తోన్న ఓ జూనియర్ ఇంజినీర్ కూడా ఉన్నాడు. పేపర్ లీక్ గ్యాంగ్‌తో కలిసి తాను అక్రమాలకు పాల్పడినట్లు సదరు జూనియర్ ఇంజినీర్ విచారణలో అంగీకరించాడట. మే 4వ తేదీన రామకృష్ణ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పాఠశాలలో ఈ గ్యాంగ్ నకిలీ పరీక్ష సెషన్‌ను నిర్వహించింది. ఇక్కడ సమాధానాలతో కూడిన నీట్ ప్రశ్నపత్రాలను అభ్యర్ధులకు పంపిణీ చేసినట్లు వెల్లడైంది. ఈ పేపర్ కోసం కొంతరు అభ్యర్థులు రూ.30 లక్షల నుంచి రూ.32 లక్షల వరకు ఇచ్చారు. మొత్తం 35 మంది అభ్యర్ధులకు ఈ ప్రశ్నాపత్రాలు అందాయి. అనంతరం ఆ ప్రశ్నాపత్రాలను అదే పాఠశాలలో కాల్చివేశారు.
తాజా విచారణలో ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న వారిలో కొందరిని అరెస్ట్ చేయడంతోపాటు .. క్వశ్చన్ పేపర్ లీకైనట్లు భావిస్తోన్న పాఠశాల నుంచి కాలిపోయిన ప్రశ్నాపత్రం అవశేషాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అని నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోంది. ఈ పేపర్ లీక్‌లో భాగస్వాములైనట్లు మరో 13 మందిని అధికారులు గుర్తించారు. ఇందులో నలుగురిని ఇప్పటికే అరెస్టు చేయగా.. మరో 9 మందికి నోటీసులు జారీ చేశారు. వీరు సోమ, మంగళవారాల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. తాజా ఆరోపణలపై జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ స్పందించాల్సి ఉంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.