Telangana: దసరా సెలవులు అయిపోయాయ్.. రేపటి నుంచి తెరచుకోనున్న స్కూళ్లు, కాలేజీలు..
తెలుగు రాష్ట్రాల్లో సోమవారం నుంచి విద్యాసంస్థలు పునః ప్రారంభం కానున్నాయి. 2022 దసరా సెలవులు ఈ రోజుతో ముగిశాయి. అక్టోబర్ 10 నుంచి స్కూళ్లు, కాలేజీలు యథావిధిగా పునః ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలకు సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు..
తెలుగు రాష్ట్రాల్లో సోమవారం నుంచి విద్యాసంస్థలు పునః ప్రారంభం కానున్నాయి. 2022 దసరా సెలవులు ఈ రోజుతో ముగిశాయి. అక్టోబర్ 10 నుంచి స్కూళ్లు, కాలేజీలు యథావిధిగా పునః ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలకు సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు 15 రోజుల పాటు పాఠశాల విద్యాశాఖ దసరా సెలువులు ప్రకటించింది. అలాగే జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 9 వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆదివారంతో సెలవులు ముగియడంతో అన్ని రకాల స్కూల్లు, కాలేజీలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. కాగా దసరా సెలవులు అక్టోబర్ 22వ తేదీ వరకు పొడిగించినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై స్పందించిన విద్యాశాఖ అవన్నీ పూర్తి అవాస్తవాలని, రేపట్నుంచి తెలంగాణ విద్యాసంస్థలన్నీ తెరచుకుంటాయని స్పష్టం చేసింది.
అటు ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులకు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 6 (శుక్రవారం) వరకు మొత్తం10 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 6వ తేదీ (శుక్రవారం) తర్వాత రెండో శనివారం, ఆ తర్వాత ఆదివారం నేపథ్యంలో పిల్లలు పూర్తి స్థాయిలో సోమవారం (అక్టోబర్ 10) నుంచి స్కూళ్లకు రానున్నారు. దీంతో సోమవారం నుంచి అన్ని రకాల విద్యాసంస్థలు పునః ప్రారంభం కానున్నాయి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.