RRC Southern Railway 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో.. దక్షిణ రైల్వేలో ఉద్యోగాలకు రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ నోటిఫికేషన్‌..

భారత రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన దక్షిణ రైల్వేలో.. లెవల్‌ 1, లెవల్‌ 2 కింద పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ నోటిఫికేషన్‌ విడుదల..

RRC Southern Railway 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో.. దక్షిణ రైల్వేలో ఉద్యోగాలకు రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ నోటిఫికేషన్‌..
RRC Southern Railway Recruitment 2022
Follow us

|

Updated on: Oct 09, 2022 | 4:33 PM

భారత రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన దక్షిణ రైల్వేలో.. లెవల్‌ 1, లెవల్‌ 2 కింద 17 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి. వయోపరిమితి విషయంలో రిజర్వేషన్‌ అభ్యర్ధులకు సడలింపు వర్తిస్తుంది.ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 23, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్‌ అభ్యర్ధులు రూ.500లు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులు రూ.250లు దరఖాస్తు రుసుము చెల్లించవల్సి ఉంటుంది. విద్యార్హతలు, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా స్టైపెండ్‌ కూడా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • సౌతర్న్‌ రైల్వే పోస్టులు: 14
  • ఐసీఎఫ్‌ పోస్టులు: 3

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.