Scholarship: విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. స్కాలర్‌షిప్స్ దరఖాస్తుల గడువు పెంపు..!
Scholarship: తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్‌షిప్ పొందే విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ప్రస్తుత విద్యాసంవత్సరానికి స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు..
Scholarship: తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్‌షిప్ పొందే విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ప్రస్తుత విద్యాసంవత్సరానికి స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు గడువును సర్కార్ మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్రంలోని అన్ని కాలేజీల ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ అలాగే దివ్యాంగ విద్యార్థులు 2022 జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కాలేజీ యాజమాన్యాలు లేదా విద్యార్థులు వ్యక్తిగతంగా ఈ-పాస్ పోర్టల్‌లో ఈ దరఖాస్తులను అప్‌లోడ్ చేయాలని తెలిపింది. ఈ-పాస్ వెబ్‌సైట్ ద్వారా స్కాలర్‌షిప్స్ రెన్యూవల్‌కు 7,97,656 విద్యార్థుల్లో ఇప్పటి వరకు 31,369 మంది అప్లై చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే 5.5 లక్షల మంది కొత్త విద్యార్థులకు 1,959 మంది విద్యార్థులే దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
ఇవి కూడా చదవండి: