TG PGECET 2024 Results Today: నేడే తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే

తెలంగాణ స్టేట్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌) 2024 పరీక్ష ఫలితాలు మంగళవారం (జూన్‌ 18) విడుదలకానున్నాయి. హైదరాబాదులోని కూకట్‌పల్లిలో ఉన్న జేఎన్‌టీయూ హెచ్‌గోల్డెన్‌ జూబ్లీ కాన్ఫరెన్స్‌ హాల్‌, అడ్మిషన్ భవనంలో ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాదు జేఎన్‌టీయూ ఆన్‌లైన్‌లో..

TG PGECET 2024 Results Today: నేడే తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే
TG PGECET 2024 Results
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 18, 2024 | 6:49 AM

హైదరాబాద్‌, జూన్‌ 18: తెలంగాణ స్టేట్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌) 2024 పరీక్ష ఫలితాలు మంగళవారం (జూన్‌ 18) విడుదలకానున్నాయి. హైదరాబాదులోని కూకట్‌పల్లిలో ఉన్న జేఎన్‌టీయూ హెచ్‌గోల్డెన్‌ జూబ్లీ కాన్ఫరెన్స్‌ హాల్‌, అడ్మిషన్ భవనంలో ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాదు జేఎన్‌టీయూ ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ పరీక్షలు జూన్‌ 13తో ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 22,712 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 20,626 (90.82%) మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు.

తెలంగాణ రాష్ట్రంలోని పలు కాలేజీల్లో ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం తెలంగాణ పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టీజీ పీజీఈసెట్‌) ప్రతీయేట నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది పీజీఈసెట్‌ పరీక్ష జూన్‌ 10 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. రోజుకు రెండు సెషన్ల చొప్పున ఈ పరీక్ష జరిగింది. మొదటి సెషన్‌ పరీక్ష ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగాయి.

పీజీఈసెట్‌ 2024లో వచ్చిన ర్యాంకు ఆధారంగా 2024-25 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, అఫిలియేటెడ్‌ ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ కాలేజీల్లో ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌, గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ ఫార్మడీ, ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పీజీఈసెట్‌ పరీక్షలో మొత్తం మార్కుల్లో కనీసం 25 శాతం మార్కులు వచ్చిన వారిని మాత్రమే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన విద్యార్ధులకు కనీస అర్హత మార్కులు ఉండవు. ఎన్ని మార్కులు వచ్చినా ర్యాంకు కేటాయిస్తారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ పీజీఈసెట్‌ 2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..
18 కోట్లతో మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
18 కోట్లతో మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఐపీఎల్ వద్దంది.. ఆసీస్ ముద్దంది.. కట్ చేస్తే..
ఐపీఎల్ వద్దంది.. ఆసీస్ ముద్దంది.. కట్ చేస్తే..