TG govt jobs: తెలంగాణ ఆరోగ్యశాఖలో 1,284 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఎవరు అర్హులంటే
తెలంగాణ రాష్ట్రంలో 1284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ పరిధిలో 1088 పోస్టులు, వైద్య విధానపరిషత్‌లో 183 పోస్టులు, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో 13 పోస్టులు భర్తీ చేయనున్నారు..
తెలంగాణ రాష్ట్రంలో 1284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ పరిధిలో 1088 పోస్టులు, వైద్య విధానపరిషత్‌లో 183 పోస్టులు, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో 13 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్ 21 తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబరు 8వ తేదీ దరఖాస్తులకు చివరి తేదీ. నవంబరు 10వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. వందపాయింట్ల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్షకు 80 పాయింట్లు, ప్రభుత్వ సర్వీసుకు 20 పాయింట్ల చొప్పున ఉంటాయని ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ఖాళీల వివరాలు ఇలా..
- డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్/ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పోస్టులు: 1088
- తెలంగాణ వైద్య విధాన పరిషత్ పోస్టులు: 183
- ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్ రీజినల్ క్యాన్సర్ సెంటర్ పోస్టులు: 13
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ల్యాబొరేటరీ టెక్నీషియన్ సర్టిఫికెట్ కోర్సు/ ఎంఎల్‌టీ(ఒకేషనల్)/ ఇంటర్మీడియట్ (ఎంఎల్‌టీ ఒకేషనల్)/ బీఎస్సీ (ఎంఎల్‌టీ)/ ఎంఎస్సీ(ఎంఎల్‌టీ)/ డీఎంఎల్‌టీ/ బీఎంఎల్‌టీ/ పీజీడీ ఎంఎల్‌టీ/ బీఎస్సీ (మైక్రోబయాలజీ)/ ఎంఎస్సీ (మైక్రోబయాలజీ/ మెడికల్ బయోకెమిస్ట్రీ/ క్లినికల్ మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు జులై 1, 2024 నాటికి 18 నుంచి 46 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 8, 2024వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ పరీక్ష ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.500 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు పోస్టును బట్టి రూ.32,810 నుంచి రూ.1,37,050 వరకు జీతంగా చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
- ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 21, 2024.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 5, 2024.
- దరఖాస్తు సవరణ తేదీలు: అక్టోబర్ 7 నుంచి 8 వరకు.
- రాత పరీక్ష తేదీ: నవంబర్ 10, 2024.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.