TS Inter: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షా ఫలితాలు వచ్చేది అప్పుడే..?
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. గత బుధవారంతో ఇంటర్ సెకండియర్ పరీక్షలు పూర్తయ్యాయి. సెకండ్ ఇయర్ పరీక్షలకు మొత్తం 4,17,525 మంది విద్యార్థులకు 4,02,630 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు...
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. గత బుధవారంతో ఇంటర్ సెకండియర్ పరీక్షలు పూర్తయ్యాయి. సెకండ్ ఇయర్ పరీక్షలకు మొత్తం 4,17,525 మంది విద్యార్థులకు 4,02,630 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
ఇక పరీక్షలు ముగిసిన నేపథ్యంలో అధికారులు జవాబు పత్రాల మూల్యాంకనంపై దృష్టిసారించారు. వీలైనంత త్వరగా ప్రశ్నాపత్రాల మూల్యాంకనం చేపట్టాలని లక్ష్యంతో ఉన్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ప్రారంభమైన వాల్యుయేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. వాల్యుయేషన్ విషయంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎక్కడ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.
ప్రస్తుతం విద్యార్థుల దృష్టి ఫలితాలపై పడింది. ఎప్పుడెప్పుడు రిజల్ట్స్ వస్తాయా అన్న ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం తెలంగాణ ఇంటర్ ఫలితాలను మే మొదటి వారంలో విడుదల చేయడానికి తెలంగాణ ఇంటర్ బోర్డ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జూన్ 1వ తేదీ నుంచి ఇంటర్ తరగతులను ప్రారంభించాలని భావిస్తోన్న అధికారులు అంతలోపు ఫలితాల ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను రెండు మూడు రోజుల వ్యవధిలోనే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఫలితాలకు సంబంధించి వారం, పది రోజుల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..