Medical Jobs: ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రాత పరీక్ష లేకుండానే ప్రభుత్వాసుపత్రిలో ఉద్యోగాలు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాసుపత్రిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. శ్రీకాకుళలం జిల్లాలో ఉన్న వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకు గాను శ్రీకాకుళంలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీలను కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ విధానంలో..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాసుపత్రిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. శ్రీకాకుళలం జిల్లాలో ఉన్న వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకు గాను శ్రీకాకుళంలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీలను కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ విధానంలో తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు.
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 36 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో పీడియాట్రిషియన్ (01), గైనకాలజిస్టు (02), మెడికల్ ఆఫీసర్ (22), డెంటల్ హైజీనిస్ట్ (09), డెంటల్ టెక్నీషియన్ (01), క్లినికల్ సైకాలజిస్ట్ (01) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంటర్, డిప్లొమా, ఎంబీబీఎస్, మెడికల్ పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను అకడమిక్‌లో సాధించిన మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆఫ్‌లైన్ దరఖాస్తులను శ్రీకాకుళంలోని జిల్లా వైద్యారోగ్య అధికారి ఆఫీసుకు పంపించాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు 06-04-2023 తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..